శ్మశానస్థలం కబ్జా చేస్తున్నారంటూ..కుటుంబంతో సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Save graveyard In UP : తమ కళ్లెదుటే స్థలాలను కబ్జా చేస్తున్నా..కొంతమంది చూసిచూడటన్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది పోరాటానికి దిగుతారు. వారి బెదిరింపులకు వెనుకడగు వేస్తుంటారు. ఇలాగే..చనిపోయిన తర్వాత..పాతిపెట్టే…శ్మశాన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఆవేదన చెందాడో ఓ వ్యక్తి. వారి నుంచి కాపాడే ప్రయత్నాలు చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. చివరకు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడు. కుటుంబంతో కలిసి మూకుమ్మడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కాన్పూర్ దెహత్, మూసానగర్ కు చెందిన గుల్ఫమ్ (35), భార్య, ఆరుగురు పిల్లలతో (భార్య jmerun (31), కూతుళ్లు Mehjabin (13), Masiha (8), Moeena (7), Chand Tara (5), Sitara (2) కొడుకు Mohammad Atif (10)) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతున్న వారి అరుపులు విన్న స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడో చెప్పాడు గుల్ఫమ్. తాను ఊర్లోని శ్మశాన వాటిక స్థలానికి కాపలాగా ఉంటున్నట్లు, అయితే..ఈ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా…లాభం లేకపోయిందని ఆరోపించాడు.

అందుకే..భార్య, బిడ్డలతో చనిపోవడానికి సిద్ధమయ్యానని  తెలిపాడు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 10 నుంచి 12 శాతం కాలినగాయాలున్నాయని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించినట్లు అనంతరం జిల్లా ఆసుపత్రిలో చేరిపించామని Senior police official (Kanpur Dehat) Keshav Kumar Choudhary వెల్లడించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.