Uttar pradesh: మరో మూత్ర ఘటన.. దళిత స్నేహితుడితో గొడవపడి, అతడి చెవిలో మూత్రం పోశారు

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు ఏం జరిగిందో తెలియని మద్యం మత్తులో ఉన్నాడు

Uttar pradesh: మరో మూత్ర ఘటన.. దళిత స్నేహితుడితో గొడవపడి, అతడి చెవిలో మూత్రం పోశారు

Updated On : July 15, 2023 / 5:25 PM IST

Urinate Case: మధ్యప్రదేవ్ రాష్ట్రంలో ఒక గిరిజన వ్యక్తి ముఖంపై పర్వేశ్ శుక్లా అనే బ్రాహ్మణ వ్యక్తి మూత్రం పోసిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగు చూసంది. రాష్ట్రంలోన సోన్‌భద్రలో ఓ వ్యక్తి దళితుడి చెవిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి మరొకరిపై మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

CM Himanta Biswa Sarma : ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి : అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

జూలై 11న జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడి పేరు గులాబ్ కోల్. నిందితుడి పేరు జవహార్ పటేల్. వీరు చాలా కాలంగా స్నేహితులు. ఈ ఇద్దరికి తోడు మరో స్నేహితుడు కలిసి మద్యం సేవించారు. అనంతరం వాగ్వాదానికి దిగారు. గులాబ్ కోల్‌పై జవహర్ పటేల్ దాడికి దిగాడు. అనంతరం అతడి చెవులపై మూత్ర విసర్జన చేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

karnataka : చిరుతపులికే చుక్కలు చూపించాడు.. బైక్‌కి కట్టేసి అధికారులకు అప్పగించిన యువకుడు

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు ఏం జరిగిందో తెలియని మద్యం మత్తులో ఉన్నాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో చిత్రీకరించారని, అది సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై గులాబ్ కోల్ తర్వాత ఫిర్యాదు చేశాడని, ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Iqra and Mulayam Love story: సీమా హైదర్‭కి ఒక న్యాయం, ఇక్రాకి మరొక న్యాయమా? లూడో ఆటతో చిగురించిన ప్రేమ.. ఇండియాకు వచ్చిన మరో పాక్ యువతి

గిరిజన వర్గానికి చెందిన దశమత్ రావత్‌పై మూత్ర విసర్జన చేశారనే ఆరోపణపై మధ్యప్రదేశ్‌లో ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. విపక్షాలు బీజేపీ మీద పెద్ద ఎత్తున దాడి చేశఆయి. ఆ తర్వాత బాధితుడిని తన నివాసానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. అతడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పాడు.