Manipur : మణిపూర్‌ సర్కార్ సంచలన నిర్ణయం… 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత

మద్యం విషయంలో మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది....

Manipur : మణిపూర్‌ సర్కార్ సంచలన నిర్ణయం… 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత

liquor

Manipur : మద్యం విషయంలో మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు, అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు తమ మంత్రివర్గం మద్యం పాలసీని సంస్కరించిందని మణిపూర్ సర్కార్ ప్రకటించింది.

ALSO READ : Varanasi : వరణాసి ఆశ్రమంలో నలుగురు ఆంధ్రా కుటుంబ సభ్యుల ఆత్మహత్య

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రంలో 30 ఏళ్లకు పైగా సంపూర్ణ మద్య నిషేధం తర్వాత మద్యం తయారీ, ఉత్పత్తి, స్వాధీనం, ఎగుమతి, దిగుమతి, రవాణా, కొనుగోలు, అమ్మకం, వినియోగానికి ఆమోదం తెలిపింది.2022 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మద్య నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేశారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, 20 గదులు ఉన్న హోటళ్లలో మద్యం అమ్మకాలకు, స్థానికంగా తయారుచేసిన దేశీయ మద్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించారు.

ALSO READ : NTR Statue : ఓటమి భయంతోనే వైసీపీ దుశ్చర్యలు- ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై బాలకృష్ణ, లోకేశ్ ఆగ్రహం

ఈ సారి మణిపూర్ సంపూర్ణ మద్యపాన నిషేధ చట్టం 1991 చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. మద్యపానం వల్ల ఉత్పన్నమయ్యే సామాజిక సమస్యలు, గృహ హింస కారణంగా ప్రజలు, మహిళా సంఘాల నుంచి వచ్చిన డిమాండ్‌ను అనుసరించి మణిపూర్ మద్యపాన నిషేధ చట్టం 1991ని రూపొందించారు.తాజాగా మణిపూర్ లో పాక్షిక మద్య నిషేధాన్ని ఎత్తివేసి, మద్యం విక్రయానికి గేట్లు బార్లా తెరిచారు.