ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ..బైటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుల డంప్

  • Publish Date - July 17, 2020 / 11:18 AM IST

మణిపూర్‌లో టెన్నోపాల్‌ పరిధిలోని మొరెహ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవటానికి గుంతలు తీస్తుండా భారీగా బాంబులు బైటపడ్డాయి. వాటిని చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.అవన్నీ రెండో ప్రపంచ యుద్ధం నాటి డంపులుగా అధికారులు గుర్తించారు.
పేలకుండా ఉన్న బాంబులు ఇళ్ల మధ్యలో కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటివి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయోనని భయపడుతున్నారు.

లాగ్నమ్‌ గ్రామంలో ఇళ్లు కట్టుకోవడానికి ఓ వ్యక్తి తన ఖాళీస్థలాన్నిట్రాక్టర్‌తో చదును చేయిస్తున్నాడు. ఈ క్రమంలో యంత్రానికి ఓదో గట్టిగా తగిలాయి. దీంతో అతను జాగ్రత్తగా తవ్వి చూడగా..కొన్ని బాంబులు కనిపించాయి. అవి చూసి ఆశ్చర్యపోయిన అతను అలా జాగ్రత్తగా కొంచెంది దూరం తవ్వగా ఏకంగా బాంబు డంప్ బైటపడింది.

వెంటనే పోలీసులు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. 1939-45 మధ్య కాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బాంబులు, మందుగుండు సామగ్రి అక్కడ దాచినట్టుగా గుర్తించారు. ఆ ప్రాంతం భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో ఉండటంతో తలించేందుకు అనుకూలంగా ఉంటాయని దాచినట్టుగా భావిస్తున్నారు. కాగా 43 ఖాళీ బాంబు కేసులు, 15 ఖాళీ బాక్సులు, మందుగుండు సామగ్రితోపాటు ప్రత్యేక గుళికలు స్వాధీనం చేసుకున్నారు.