Manish Sisodia-Delhi liquor Scam: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనను ఇవాళ ఈడీ అరెస్టు చేయడం గమనార్హం. ఆయన అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది.

Manish Sisodia-Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనను ఇవాళ ఈడీ అరెస్టు చేయడం గమనార్హం. ఆయన అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది.

మూడు రోజుల పాటు తీహార్ జైలులో సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, డ్రాఫ్ట్ కాపీ ముందుగానే నిందితులకు పంపడం, కీలక ఆధారాలు డిలీట్ చేయడం, 5 శాతం ఉన్న కమిషన్ ను 12 శాతానికి పెంచడం,రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు సహా కీలక అంశాలపై సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. జైలులో ఈడీ అధికారుల విచారణకు సిసోడియా సహకరించలేదని తెలుస్తోంది.

ఇప్పటికే సీబీఐ కేసులో తిహార్ జైలులో ఉన్న సిసోడియాను ఈడీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఇదే తరహాలో అభిషేక్, విజయ్ నాయర్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా మనీశ్ సిసోడియా ఉన్నారు. లిక్కర్ కుంభకోణం వల్ల రూ.2,873 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఈడీ అంటోంది.

మనీలాండరింగ్ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఎల్లుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ ప్రశ్నించనుంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మార్చి 6న వారం రోజుల సీబీఐ విచారణ తరువాత సిసోడియాకి మార్చి 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు.

Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో