కేజ్రీవాల్ మానసిక స్థితి సరిగా లేదు…ఢిల్లీ బీజేపీ చీఫ్

 NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ..ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందని సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్ స్పందించిన తివారీ…పూర్వాంచల్ కు చెందినవాళ్లు అక్రమ వలసదారులని కేజ్రీవాల్ చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎవరిని ఢిల్లీ నుంచి ఆయన వెళ్లగొడదామనుకుంటున్నారని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని విదేశీయులుగా పరిగణిస్తారా,ఢిల్లీ నుంచి వెళ్లగొడదామనుకుంటున్నారా అని కేజ్రీవాల్ ను తివారీ ప్రశ్నించారు. అదే కేజ్రీవాల్ ఉద్దేశ్యమయితే…ఆయన మానసిక స్థితి కోల్పోయింటారని తాను అనుకుంటున్నట్లు తివారీ తెలిపారు. ఒక IRS అధికారిగా పనిచేసిన ఆయనకు NRC అంటే ఏంటో తెలియదా అని ప్రశ్నించారు.