Rahul Gandhi : భారతీయులు చాలామంది మహిళలను మనుషులుగానే చూడడం లేదు..ఇది సిగ్గుచేటు: రాహుల్ గాంధీ

భారతీయులు చాలామంది మహిళలను మనుషులుగానే చూడడం లేదు..ఇది సిగ్గుచేటైన విషయం అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.

Many Indians Do Not Consider Women Is Human Rahul Gandhi

Many Indians Do not Consider Women is Human : ఢిల్లీలో 20 ఏళ్ల అత్యాచారం బాధితురాలిని పొరుగువారు దారుణంగా కొట్టి.. ఊరేగించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి ఘటనలు సిగ్గుచేటు అని సమాజం సిగ్గుపడాల్సిన ఘటన అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అత్యాచార బాధితురాలైన సదరు యువతిని స్థానిక యువకులు చుట్టుముట్టి మూకుమ్మడి దాడి చేసి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..‘‘చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా చూడకపోవడం. సిగ్గుచేటైన విషయం అని అన్నారు. ఇటువంటి ఘనటనలకు సమాజం నుంచి పారదోలాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బాధితులు తమపై జరిగిన దాడిపై కృంగిపోతుంటారని అటువంటివారిపై వ్యవహరించే తీరు ఇదేనా? ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయటం సరికాదని కోరారు.

కాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం ఢిల్లీ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. విచారణ నిర్వహిస్తున్నామని..సోషల్ మీడియాలో ఇటువంటివి సరికాదని కోరారు.