Blast
Blast : శనివారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిగింది. డీజిల్ ఇంజన్ వస్తున్న సమయంలో దుండగులు పేలుళ్లకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వా రోడ్, బర్కానా సెక్షన్ ఈ ‘బాంబు పేలుడు’ జరిగినట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 12:55 గంటలకు బ్లాక్ సెక్షన్‌లో డీజిల్ లోకో వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు పేలుడుకు పాల్పడినట్లు తెలిపారు రైల్వే అధికారులు.
చదవండి : Afghan Mosque Blast : అప్ఘాన్ మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, 15 మందికి గాయాలు
విషయం తెలియడంతో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్లు, సీనియర్ డివిజనల్ ఇంజనీర్‌తో సహా వివిధ విభాగాల రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లైన్ పునరుద్ధరణ పనులు తుదిదశకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు అధికారులు.
చదవండి : Firecrackers Blast : బాబోయ్… బైక్‌పై వెళ్తుండగా బాంబుల్లా పేలిన టపాసులు.. తండ్రి, ఏడేళ్ల కొడుకు మృతి
పట్టాలు డ్యామేజ్ కావడంతో అటుగా ప్రయాణించే డెహ్రీ ఆన్ సోన్ – బర్వాదిహ్ ప్యాసింజర్ స్పెషల్ (03364), బర్వాడిహ్- నేతాజీ సుభాష్ చంద్రబోస్ గోమో స్పెషల్ రైలు (03362) రద్దు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్ల రూట్లు మార్చారు.