Bank Holidays: మార్చి నెలలో బ్యాంక్ హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే..?

దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను విడుదల చేసింది.

Bank Holidays: మార్చి నెలలో బ్యాంక్ హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే..?

Bank Holidays

Updated On : March 1, 2025 / 8:19 AM IST

March Bank Holidays: ఆర్థిక అవసరాల నిమిత్తం తరచుగా బ్యాంకులకు వెళ్లేవారికి అలర్ట్. మార్చి నెలలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో ముందుగా తెలుసుకోండి. బ్యాంకులకు వెళ్లి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు కచ్చితంగా బ్యాంకులు ఏ రోజుల్లో తెరుచుకొని ఉంటాయి.. ఎప్పుడు మూసివేసి ఉంటాయనే వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీ ప్రాంతంలోని బ్యాంకులకు వెళ్లే రోజులను ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

Bank Holidays

దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సిన వారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి.

Bank Holidays

మార్చిలో బ్యాంక్ హాలిడేస్..
♦ మార్చి 7 (శుక్రవారం) – ‘చాప్‌చార్‌ కుట్’ పండుగ సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. మిజోరంలో ఇది పెద్ద పండుగ.
♦ మార్చి 13 (గురువారం) : మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
♦ మార్చి 14 (శుక్రవారం) : హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, గోవా, బిహార్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల బ్యాంక్ సెలవు ఉంది.
♦ మార్చి 15(శనివారం) : కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులు మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో బ్యాంకుకు సెలవు ఉంటుంది.
♦ మార్చి 22(శనివారం) : ‘బీహార్ దివస్’ నేపథ్యంలో ఈ రోజున బిహార్‌ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంది.
♦ మార్చి 27 (గురువారం) : షాబ్-ఐ- కాద్ర్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో బ్యాంకులకు హాలిడే ఉంది.
♦ మార్చి 28 (శుక్రవారం) : ఈద్ ఉల్ ఫితుర్‌కు ముందు చివరి శుక్రవారం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో బ్యాంక్ సెలవు ఉంది.
♦ మార్చి 31 (సోమవారం): ముస్లింల అతిపెద్ద ఫెస్టివల్ అయిన ఈద్ ఉల్ ఫితుర్ (రంజాన్) నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడే ఉంది.

Bank Holidays

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఇలా..
మార్చి8న రెండో శనివారం.
మార్చి 14న హోలీ.
మార్చి 22న నాలుగో శనివారం.
మార్చి 30న ఉగాది.
మార్చి 31న రంజాన్
మార్చి 2, 9, 16, 23 (ఆదివారాలు)
మార్చి నెలలో మొత్తం తొమ్మిది రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.