Maruthi
Maruti Hike Prices : కార్ల తయారీలో పేరొందిన మారుతీ కంపెనీ ధరలు పెంచేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. అయితే..ఈ ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలపింది. అయితే..ధరలు ఎంత మాత్రం పెరుగుతాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మోడల్ ని బట్టి ధర మారుతుంటుందని బీఎస్ఈ ఫైలింగ్ లో వెల్లడించింది. ఇలా ధరలు పెంచుతుండడం మూడోసారి. జనవరి 18వ తేదీన గరిష్టంగా కొన్ని మోడళ్లపై రూ. 34 వేలు, ఏప్రిల్ లో ఎక్స్ షోరూం ధరలపై 1.6 శాతం పెంపు అమలు చేసింది. ధరలు పెంచడానికి గల కారణాలు వెల్లడించింది. తయారీ, నిర్వాహణ, ముడి సరుకులు తదితర వస్తువుల వ్యయం అధికం కావడమే ఇందుకు కారణమని తెలిపింది.