Cloth Mask
Omicron Variant: దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 విస్తరిస్తోంది. కరోనా మూడో వేవ్ ప్రస్తుతం విపరీతంగా సాగుతోండగా.. అదే సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి.
ఒమిక్రాన్ కేసులు ప్రస్తుతం ట్రాన్‌స్మిషన్ స్థాయిలో ఉండగా.. ఒమిక్రాన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.
ఒమిక్రాన్‌ను నివారించడానికి మాస్క్ ధరించడం చాలా ముఖ్యం కాగా.. మనలో చాలామంది క్లాత్ మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో క్లాత్ మాస్క్ ప్రభావవంతంగా పనిచేయట్లేదు.
ముఖ్యంగా ఒమిక్రాన్ విషయంలో క్లాత్ మాస్క్, క్లాత్ కట్టుకున్నా ఒమిక్రాన్ సోకవచ్చునని చెబుతున్నారు నిపుణులు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణను నివారించడానికి గుడ్డతో చేసిన మాస్క్ సరిపోదని, ఓమిక్రాన్‌ను నివారించడానికి గుడ్డతో చేసిన మాస్క్ కాకుండా.. Omicron వేరియంట్‌ను నివారించేందుకు N95, KN95 మాస్క్‌లే కచ్చితంగా పెట్టుకోవాలి అని చెబుతున్నారు.
సర్జికల్ మాస్క్‌లు కూడా కొంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కానీ డబుల్ మాస్క్‌లు ధరిస్తేనే ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. మూడు పొరల మాస్క్‌లను పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.