Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు కీలక నేతలు సహా 10 మంది మావోయిస్టులు మృతి..

Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఉదయం గరియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 10మంది మావోయిస్టులు మరణించారు. గరియాబాద్ ఈ30, ఎస్టీఎఫ్, కోబ్రా జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

మృతుల్లో ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలృష్ణ కూడా ఉన్నట్లు తెలిసింది. థానా మెయిన్ పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటన స్థలి నుంచి మృతదేహాలతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా మాట్లాడుతూ.. గరియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.