ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Massive encounter in Chhattisgarh

Encounter in Chhattisgarh: మావోయిస్టులకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.

మూడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు భారీగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతి చెందాడు.

ఈ ఎన్‌కౌంటర్‌పై చత్తీస్‌గఢ్ ఉప‌ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందిస్తూ జవాన్లు పెద్ద విజయం సాధించారు, జవాన్లకి అభినందనలు అంటూ తెలిపారు.