West Bengal Accident
West Bengal Accident : పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నార్త్ 24 పరగణాస్‌లోని బాగ్డా నుండి 20 మందికి పైగా వ్యక్తులు అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని మటాడోర్‌లోని నవద్వీప్ శ్మశానవాటిక వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది.
చదవండి : West Bengal : పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత
హన్స్‌ఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్‌బరీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వారు వెళ్తున్న వాహనం ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దట్టమైన పొగమంచు, వాహనం అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వివరించారు. కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి :West Godavari : దళిత మహిళా సర్పంచ్‌కు అవమానం