West Godavari : దళిత మహిళా సర్పంచ్‌కు అవమానం

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది. దళిత మహిళా సర్పంచ్ నుతంగి సరోజినిని.. సర్పంచ్ చాంబర్ లోకి రావద్దంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ బయట నెలబెట్టారు.

West Godavari : దళిత మహిళా సర్పంచ్‌కు అవమానం

Sarpanch

Updated On : October 6, 2021 / 8:24 AM IST

mla insulted woman sarpanch : శాస్త్ర, సాంకేతిత రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా కుల వివక్ష కొనసాగుతూనేవుంది. సాటి మనిషిని మనిషిగా చూడటం లేదు. దళితులు అడుగడుగునా అవమానాలకు గురవుతూనేవున్నారు. ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగాలు చేస్తున్నా, పదవుల్లో ఉన్నా దళితులకు అవమానాలు తప్పడం లేదు.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది. మండల అధికారుల సమక్షంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ సర్పంచ్ నుతంగి సరోజినిని సర్పంచ్ చాంబర్ లోకి రావద్దంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ బయట నిలబెట్టారు.

Caste Discrimination : గుడికి వెళ్లిన దళితుడు..అపవిత్రం అయ్యిందంటూ 25 వేలు జరిమానా..

అధికారులతో తాను మాట్లాడాలంటూ సర్పంచ్‌ సరోజినిని… ఆమె చాంబర్‌లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ చర్యపై సర్పంచ్‌ కొడుకు మండిపడుతూ ఎమ్మెల్యేని నిలదీశారు.