మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారా? ఇది ఆఖరి పోరాటమా?

గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.

​Maoists : అబూజ్ మడ్.. మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డా. అలాంటిది ఆ ఏరియా ఇప్పుడు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. వరుస ఎన్ కౌంటర్లు అదే చెబుతున్నాయి కూడా. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు.. పోతున్న ప్రాణాలు.. మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బగా మారుతున్నాయి. 20 ఏళ్లుగా అనేక ఒడిదొడుకులు చూస్తున్న మావోయిస్టు పార్టీకి రానున్న రోజులు మరింత కఠినంగా మారబోతున్నాయా? ఇది ఒకరకంగా ఆ పార్టీ చేసే ఒంటరి పోరాటామా?

మావోయిస్టులకు ఎందుకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి? మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? 2026 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం.. నెక్ట్స్ ఏం చేయబోతోంది? కేంద్రం వ్యూహాలు నెరవేరడం ఖాయమా? మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడం సాధ్యమేనా?

ఒకప్పుడు అబూజ్ మడ్ ను కేంద్రంగా చేసుకుని మావోలు సమాంతర ప్రభుత్వాలను నడిపించారు. అలాంటిది ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నారు. దీనిక వెనుక కేంద్రం పక్కా వ్యూహం ఉంది. గత ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు.. వారి ద్వారా మావోల సమాచారం తెలుసుకున్నాయి. టైమ్ చూసి అటాక్ చేయడం మొదలు పెట్టాయి.

ఈ ఏడాది జనవరి నుంచి మరింత దూకుడు పెంచాయి బలగాలు. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటిని ఒక్కొక్కటిగా బలగాలు చేజిక్కించుకోవడం స్టార్ట్ చేశాయి. ఇక, గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు. ఇలా లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లతో అబూజ్ మడ్ లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2026 కల్లా దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి ఆపరేషన్ సమాధాన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. సమాధాన్ మావోయిస్టుల నిర్మూలనలో చిట్టచివరి ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. అయితే, ఈ టార్గెట్ ను రీచ్ అవ్వలేదు…

పూర్తి వివరాలు..

Also Read : మేఘాలయలో వరదల బీభత్సం..