కిక్కే కిక్కు..ఇంటికే మద్యం, కండీషన్ అప్లై

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 10:09 AM IST
కిక్కే కిక్కు..ఇంటికే మద్యం, కండీషన్ అప్లై

Updated On : August 8, 2020 / 10:53 AM IST

కరోనా వైరస్ కారణంగా…భారతదేశంలో అన్ లాక్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్నింటికీ ఫర్మిషన్ ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రాలకు ప్రధాన వనరుగా భావించే ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కూడా..నిబంధనలతో కూడిన అనుమతులిస్తోంది. ఇప్పటికే మద్యం షాపులు తెరుచుకున్నాయి.



పబ్బుులు, బార్లు ఇంకా క్లోజ్ ఉన్నాయి. కానీ..చాలా మంది మద్యం షాపులకు వెళ్లాలంటేనే చిరాకు పడుతున్నారు. చాంతాడంత క్యూ లో నిలబడాలా అని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ఖజానా పెంచుకొనేందుకు వివిధ మార్గాలను వెతుకుతున్నాయి. అందులో భాగంగా..వివిధ కంపెనీలతో టై అప్ అయి..డోర్ డెలివరీకి అవకాశాలిస్తున్నాయి.



ఈ జాబితాలో మేఘాలయ రాష్ట్రం కూడా చేరింది. ఇందులో భాగంగా..మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి జేమ్స్ కే సంగ్మా వెల్లడించారు. ఇంటికే మద్యాన్ని సరఫరా చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని, కానీ కొన్ని కండీషన్స్ పెట్టామని వెల్లడించారు.



ఒక ఆర్డర్ పై మూడు లీటర్ల లిక్కర్, నాలుగు లీటర్ బీర్ కన్నా..ఎక్కువ సరఫరా చేయడానికి వీలు లేదన్నారు. కొనుక్కొనే వారు..తమ వయస్సు 20 ఏండ్లకు పైగా ఉందనే పత్రాన్ని తప్పకుండా సమర్పించాలని, ఎవరైన తప్పుడు పత్రాలు సమర్పిస్తే..మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.