లోక్‌సభ ఫలితాల తర్వాత.. నితీశ్ కుమార్‌పై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మీమ్స్.. ఎందుకంటే?

దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. ఇండియా కూటమి అభ్యర్ధులు

Lok Sabha Election results 2024 : లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించి మరోసారి అధికార పీఠాన్ని అదిరోహించేందుకు సిద్ధమైంది. మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి జనతాదళ్ యునైటెడ్ (జేడీయు) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై పడింది. నితీశ్ కుమార్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఎన్డీయే కూటమిలోఉన్న నితీశ్.. ఎన్నిల ఫలితాల తరువాత ఇండియా కూటమివైపుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీంతో ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ తప్పేలా లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.

Also Read : Pawan kalyan – Vijay : పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. పవన్ లాగే విజయ్ కూడా..

దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. ఇండియా కూటమి అభ్యర్ధులు 233 నియోజకవర్గాల్లో, ఇతరులు 17 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్కు 272 చేరుకోవాలి. 241 స్థానాలతో దేశంలో అతిపెద్దపార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ మార్కును అందుకోలేక పోయింది. దీంతో ఎన్డీయే కూటమి సహాయంతోనే ప్రధాని పీఎం పీఠాన్ని అదిరోహించబోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా అనూహ్యంగా పుంజుకుంది. ఇండియా కూటమికి 233 స్థానాలు వచ్చాయి. ఎన్డీయే కూటమి నుంచి నితీశ్, చంద్రబాబు బయటకు వస్తే ఇండియా కూటమిదే అధికారం అవుతుందన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతుంది.

Also Read : బీఎస్పీ అధినేత మాయావతికి బిగ్ షాకిచ్చిన యూపీ ఓటర్లు..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ నితీశ్ కుమార్, చంద్రబాబుతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఆ ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. బీహార్ లో నితీశ్ కుమార్ జేడీయూకు 12, ఏపీలో టీడీపీకి 16 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలతో పాటు మరికొందరు ఇతర పార్టీల ఎంపీలు ఇండియా కూటమివైపు మొగ్గితే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో నితీశ్ కుమార్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు