Viral video: విమానంలో పేకాట.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? విమర్శల వర్షం..

ఒకరు కామెంట్ చేస్తూ.. “ఇది మంచి ప్రవర్తన కాదు. ఇతర ప్రయాణికులు టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎలా? ఇలా ప్రవర్తించడం తగదు” అని అన్నారు.

విమానంలో కొంతమంది యువకులు పేకాట ఆడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు శాలువాతో నాలుగు సీట్ల మధ్య తాడుగా కట్టి, దానిపై పేకాట ఆడేలా సెటప్ చేశారు నలుగురు యువకులు. ప్రయాణికులు నడిచేందుకు వీలులేకుండా చేశారు.

ఈ వీడియోను వ్యాపారవేత్త మహావీర్ గాంధీ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. విమాన ఆ యువకులు ఇతర ప్రయాణికుల గురించి ఆలోచించుకుండా ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకరు కామెంట్ చేస్తూ.. “ఇది మంచి ప్రవర్తన కాదు. ఇతర ప్రయాణికులు టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎలా? ఇలా ప్రవర్తించడం తగదు” అని అన్నారు. మరొకరు స్పందిస్తూ.. “వీళ్ల పేకాటను ఆపే వారు ఒకరైనా ఆ విమానంలో లేరా? మిగతా ప్రయాణికులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు?” అని పేర్కొన్నారు.

టైమ్ పాస్‌ కాకపోతే సినిమా చూడాలని లేదా నిద్రపోవాలని కొందరు నెటిజన్లు చెప్పారు. అంతేగానీ, మిగతావారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. విమానంలో ప్రయాణించాల్సిన తీరు, నియమాల అమలుపై కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికులు అక్కడి నుంచి టాయిలెట్‌కు వెళ్లే వీలు లేకుండా చేసి, పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.