సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సీఏఏపై రియాక్ట్ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం బాధ, విషాదం కలిగిస్తోందని సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన సీఏఏపై కామెంట్ చేశారా లేదంటే భారతీయ పౌరులు ఎవరు, ఎవరు కాదు అనే అంశంపైన అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఓ దేశానికి వలసదారులతో మాత్రం మంచిదని మాత్రం అభిప్రాయపడ్డారు.

బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు బెన్ స్మిత్ ట్వీట్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని తనతో చెప్పినట్టు స్మిత్ ట్వీట్ లో తెలిపారు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవో కావాలని కోరుకుంటున్నట్లు సత్య చెప్పినట్లు తెలిపారు. బెన్ స్మిత్ చేసిన ట్వీట్ చాలా అంశాలు కనిపించలేదు. సత్య నాదెళ్ల వలసదాలరు గురించి మాట్లాడారా..? అక్రమ వలసదారుల గురించి పేర్కొన్నారా అనే అంశంపై క్లారిటీ లేదు. అక్రమ వలసదారుల గురించి కాకుండా.. న్యాయపరంగా వచ్చే వలసదారులతో ఓ దేశ ఉన్నతికి సాయ పడుతుందని అర్థం వచ్చేలా ఉంది. దీంతో ఆ జాతి అభివృద్ధి చెందే వీలుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడి ఉంటారు.

సిలికాన్ వ్యాలీలో, భారతదేశం నుండి చట్టబద్దమైన వలసదారులు శక్తివంతమైన స్థాయిలో ఉన్నారు. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ యొక్క CEO. అదే సమయంలో, సుందర్ పిచాయ్ గూగుల్ మరియు ఆల్ఫాబెట్  CEO. సిలికాన్ వ్యాలీలో పదుల సంఖ్యలో భారతీయ వలసదారులు CEOలుగా,స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ సమయంలో వేరే దేశం నుంచి వల వెళ్లి కేవలం తన మెరిట్ ఆధారంగా ఆ దేశంలో అంగీకరించబడిన నాదెళ్ల మరింత ఓపెన్ గా,తక్కువ విభజించే ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఫ్రిఫర్ చేస్తారు. ఈ క్రమంలోనే ఆయన టలెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ గురించి మాట్లాడినట్లు అర్థమవుతోంది.