వలస కార్మికుని ఆత్మహత్య.. రూ.2,500కి ఫోన్ అమ్మేసి, కుటుంబానికి తిండిపెట్టి… కన్నీరు పెట్టిస్తున్న కూలీ కథ

  • Publish Date - April 18, 2020 / 06:00 AM IST

ఒక్కపూట జరగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో.. అటువంటి వారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పని చేసుకుని గడిపేవాళ్లు తిండి లేక డబ్బులేక.. డబ్బు వచ్చే పనిలేక నిరాశగా.. ఆకలి బాధలు భరించలేక బాధలు పడుతున్నారు. 

ఇటువంటి సమయంలోనే.. బీహార్ నుంచి వచ్చి  గుర్గావ్‌ (Gurgaon)లో పెయింటర్ పని చేసుకుంటూ జీవిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. బీహార్ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి తన ఫోన్‌ను రూ .2,500కు విక్రయించి, ఆ డబ్బుతో ఓ పోర్టబుల్ ఫ్యాన్, కొంత రేషన్‌ను కొని తన కుటుంబం కోసం పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతనే 35 ఏళ్ల ఛాబు మండల్.

గుర్గావ్‌లో పెయింటర్ పనిచేసిన బీహార్‌కు చెందిన 35 ఏళ్ల ఛాబు మండల్ గుర్గావ్‌‌కు వచ్చి కుటుంబంతో సహా ఉంటున్నాడు. అతనికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. నలుగురు పిల్లలు, అందులో ఐదు నెలల చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు.

లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి వారి ఇంట్లో తిండికి జరగని పరిస్థితి. ఎవరో ఒకరు బయట నుంచి తెస్తే.. తింటూ జీవనం సాగించారు. అయితే ఆ రోజు మాత్రం సరుకులతో వచ్చిన భర్తను చూసి… భార్య పూనమ్ ఎంతో సంతోషపడింది. 

కానీ కుటుంబం అంతా బయటే ఓ చెట్టు దగ్గర ఉన్న సమయంలో ఛాబూ మండల్ ఇంటి లోపల సీలింగ్‌కి తాడు బిగించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వలస కార్మికుల ఆత్మహత్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. 

కరోనావైరస్ కారణంగా ఇండియా లాక్‌డౌన్ అవగా.. పనిలేక ఎంతోమంది రోజువారి కూలీలు మానసిక వేదన అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి అతను చాలా ఇబ్బంది పడగా.. బాధలు తట్టుకోలేక చనిపోయినట్లుగా అతని భార్య తెలిపింది.

అయితే గుర్గావ్ పోలీసులు మాత్రం అతను మానసికంగా బాధపడుతున్నాడు. 15 సంవత్సరాల క్రితం బీహార్‌లోని మాధేపురా జిల్లాకు చెందిన మండల్ గుర్గావ్‌కు వెళ్లి పెయింటర్‌గా పని చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం, అతను వివాహం చేసుకున్నాడు.

Also Read | COVID-19 శవాన్ని సమాధి చేస్తారా.. దహనం చేస్తారా.. ఏది సేఫ్?