Covid Third Wave: కొవిడ్ థర్డ్ వేవ్ జనవరి, ఫిబ్రవరిల్లో రావొచ్చు: ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్

Mild third wave of Covid likely to peak in 2022: IIT Kanpur prof

Covid third wave: ఇండియాలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరి నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పీక్స్ లో ఉండనుందని అంచనా వేశారు మనీంద్రా అగర్వాల్. అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఓ మాదిరి ఇన్ఫెక్షన్:
కొత్త వేరియంట్ గురించి భయాందోళనపడాల్సిన అవసరం లేదని.. కాకపోతే జాగ్రత్తగా ఉండాలని అన్నారు. దక్షిణాఫ్రికా రీసెర్చ్ స్టడీ ప్రకారం.. మనీంద్రా అగర్వాల్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ సహజంగా ఉన్న ఇమ్యూనిటీని దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్ కేవలం తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తుందని అన్నారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉండనున్నాయి.

లాక్‌డౌన్ తప్పదు:
థర్డ్ వేవ్ సమయంలోనూ లాక్ డౌన్ తప్పదని అన్నారు మనీంద్రా అగర్వాల్. ప్రభుత్వం చూపించే పనితీరును బట్టి దీని ప్రభావం కనిపిస్తుంది. నైట్ కర్ఫ్యూ, నిబంధనలు, గుంపులుగా చేరకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల వైరస్ తారాస్థాయికి చేరుకుండా అడ్డుకోగలమని అంటున్నారు.

…………………………………… : విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చిన వీడియో గేమ్

ట్రెండింగ్ వార్తలు