Video Game : విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చిన వీడియో గేమ్

కర్నూలులో వీడియో గేమ్ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. గేమ్ ఆడడంతో విద్యార్థి అన్ కాన్సియస్ లోకి వెళ్లాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థి.

Video Game : విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చిన వీడియో గేమ్

Kurnool

A student in unconsciousness : కర్నూలులో ఓ వీడియో గేమ్ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. వీడియో గేమ్ ఆడడంతో విద్యార్థి అన్ కాన్సియస్ లోకి వెళ్లాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిగా గుర్తించారు. సెల్ ఫోన్ లో అదేపనిగా వీడియో గేమ్ ఆడుతూ సదరు విద్యార్థి ప్రాణాల మీదికు తెచ్చుకున్నాడు.

సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ విద్యార్థి కిందపడిపోయాడు. బాలుడు ఇప్పుడు ఎవరిని గుర్తించ లేని పరిస్థితిలో ఉన్నాడు. మూడు నెలల నుండి విద్యార్థి అదే పనిగా గేమ్ ఆడుతున్నాడు. తల్లిదండ్రులను రెండు రోజులు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.

Masks : మాస్కే శ్రీరామరక్ష..!

ప్రస్తుతం కర్నూలు అమిలీయా ప్రేవేట్ హాస్పిటల్ లో బాలుడు చికిత్స పొందుతున్నాడు. పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, గేమ్ సెల్ ఫోన్లో అదేపనిగా ఆట ఆడుతూ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కుమారుడి పరిస్థితిని చూసి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.