14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

మోడీ 2.0 ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ మొదటి కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇవాళ(జూన్-1,2020) మధ్యాహ్నాం జరిగిన కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ,ప్రకాష్ జావదేకర్,నరేంద్ర తోమర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర(MSP)ను 50-83శాతం వరకు పెంచినట్లు ఈ సందర్భంగా నరేంద్ర తోమర్ తెలిపారు.

ఇప్పుడు 2020-21కి MSPరేటు క్వింటాల్ వరికి కు రూ.1868,జొన్నలు క్వింటాల్ రేటు రూ.2620,సజ్జలు క్వింటాల్ రేటు రూ.2150గా ఉంటుందని ఆయన తెలిపారు. రాగి,వేరుశనగ,సోయాబీన్,నువ్వులు,కందులు,మినుములు,పెసర,పత్తి కనీస మద్దతు ధర రేటు 50శాతం పెంచినట్లు నరేంద్ర తోమర్ తెలిపారు. రైతులకు తమ రుణాలను చెల్లించేందుకు ఇంకా ఎక్కువ సమయం కూడా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న MSMEs(సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు)లకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకాష్ జావదేకర్ తెలిపారు. MSMEలకు 20వేల కోట్ల సహాయక రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాష్ జావదేకర్ తెలిపారు. మధ్యతరహా పరిశ్రమలకు టర్నోవర్ పరిమితిని రూ .250 కోట్లకు సవరించినట్లు మరియు పెట్టుబడి పరిమితిని రూ .50 కోట్లకు పెంచినట్లు జావదేకర్ తెలిపారు

MSMEలకు రెండు ప్యాకేజీలను అమలుచేసేందుకు విధివిధానాలను మరియు రోడ్ మ్యాప్ ను కేబినెట్ ఆమోదించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. MSMEల కోసం రెండు ప్యాకేజీలు-ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మరియు డిస్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయబడ్డాయని గడ్కరీ తెలిపారు. నష్టాల్లోని MSMEల కొరకు 20వేల కోట్ల ప్యాకేజీ మరియు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా 50వేల కోట్ల ద్రవ్య లభ్యతను MSMEల కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ జీడీపీలోని 29శాతాన్ని MSMEలు అందిస్తాయని ఆయన తెలిపారు. దేశంలో 6కోట్ల MSMEలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Read: పెరిగిన వంట గ్యాస్ ధరలు

ట్రెండింగ్ వార్తలు