ఎన్నికల వేళ ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి

ఇప్పుడు తన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

ఎన్నికల వేళ ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి

Janardhana Reddy

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ బ్యారన్ గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. ఎలాంటి షరతులూ లేకుండా తాను ఆ పార్టీలో చేరినట్లు గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన సొంత గూటికి చేరుకోవడం గమనార్హం.

గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోకి గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2023 ఎన్నికల్లో గెలిచారు. అక్రమ మైనింగ్ కేసులో గతంలో ఆయన విచారణ ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.

అంతకుముందు బీజేపీలో దాదాపు 20 ఏళ్ల పాటు పనిచేశారు. ఇప్పుడు తన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మీ, కుటుంబ సభ్యులు కూడా బీజేపీలో చేరారు. ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. తాను మళ్లీ తన సొంటింటికి వచ్చానని గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ అన్నారు.

బీజేపీలో తన పార్టీని విలీనం చేశానని చెప్పారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు తాను కార్యకర్తగా పని చేస్తానన్నారు. తాను ఎటువంటి షరతులూ లేకుండా బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. పదవులు అవసరం లేదని చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని యడియూరప్ప అన్నారు. ఆయన చేరడంతో బీజేపీ మరింత బలపడుతుందని తెలిపారు.

ALSO READ: ఏ సిద్ధాంతం కేజ్రీవాల్‌ను పెద్ద నాయకుడ్ని చేసిందో.. అదే సిద్ధాంతానికి విరుద్ధంగా నడిచారంటూ..