Minor girl: మ్యారేజ్ చేసుకుంటానని.. తనకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని తల్లికి చెప్పి మొండికేసింది ఓ మైనర్ బాలిక. దానికి ససేమిరా అనడంతో ఫ్లెక్స్ బోర్డ్ పైకి ఎక్కేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
పర్‌దేశీపురా సమీపంలో ఉన్న భాండారీ బ్రిడ్జ్‌ను బాలిక ఎక్కిన సమయంలో తీసిన ఫొటోలతో పోలీసులు సమాచారం అందుకున్నారు. ఫ్లెక్స్ బోర్డ్ పైకి ఎక్కి ఫోన్ చూస్తూ కూర్చుంది. బాలిక పైకి ఎక్కడం చూసి స్థానికులు పోగయ్యారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని కిందకు దించే ప్రయత్నం చేశారు.
అక్కడి నుంచే పోలీసులకు విషయం వెల్లడించింది. వాళ్లు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో బాలిక ప్రేమించానని చెప్తున్న వ్యక్తిని పిలిపించారు. పర్దేశీపురా ఎస్ఐ అశోక్ పటిదార్ ఆధ్వర్యంలో బాలికకు ఆ బాలుడు నచ్చజెప్పడంతో కిందకు దిగి వచ్చింది.
‘తల్లి చెప్పిన వ్యక్తిని కాకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లాడతానని బాలిక చెప్పింది. దానికి తల్లి నిరాకరించడంతో హోర్డింగ్ ఎక్కేసింది. బాలిక ప్రేమించిన బాలుడు వచ్చి నచ్చజెప్పడంతో కిందకు దిగింది’ అని ఎస్ఐ చెప్పారు.