World War 2: రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి “మిస్సింగ్ ఫ్లైట్” 80 ఏళ్ల తరువాత భారత్ లో దొరికింది

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అదృశ్యమైన ఒక విమానం దాదాపు 80 ఏళ్ల తరువాత భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిమాలయ పర్వతాల్లో బయటపడింది.

World War 2: ఏళ్ళు గడుస్తున్నా ప్రపంచ యుద్ధ కాలంనాటి భయానక పరిస్థితులు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాటి యుద్ధ సమయంలో జరిగిన సంఘటనల తాలూకు నీడలు అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అదృశ్యమైన ఒక విమానం దాదాపు 80 ఏళ్ల తరువాత భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిమాలయ పర్వతాల్లో బయటపడింది. 13 మంది ప్రయాణికులతో చైనాలోని కున్మింగ్ ప్రాంతం నుంచి 1945 జనవరి మొదటి వారంలో బయలుదేరిన C-46 ట్రాన్స్పోర్ట్ విమానం హిమాలయ పర్వతాల మీదుగా ప్రయాణించి ఆ తరువాత కనిపించకుండా పోయింది. అందులోని ఆఫీసర్ స్థాయి అధికారి సహా 13 మంది ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు.

Also Read: US – Canada: అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి భారతీయ కుటుంబం బలి

కాగా ఆ విమానంలో మృతి చెందిన ఒక అధికారి కుమారుడు “బిల్ షెరెర్” అనే వ్యక్తి..ఇటీవల తన తండ్రి మరణం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా తన తండ్రి చివరగా ప్రయాణించిన విమానాన్ని వెతికిపెట్టాలంటూ అమెరికాకు చెందిన ప్రముఖ సాహస యాత్రికుడు “క్లేటన్ కుహ్లెస్” సహాయాన్ని కోరాడు షెరెర్. దీంతో విమాన ప్రయాణ వివరాలు సేకరించిన కుహ్లెస్ బృందం.. అది భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ వద్ద హిమాలయ పర్వతాల్లో కుప్పకూలినట్లు గుర్తించారు. 2021 ఆగష్టులో అరుణాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వతాల్లో శిబిరం ఏర్పాటు చేసిన కుహ్లెస్ బృందం.. గడ్డకట్టే చలిలో, స్థానిక గైడ్ల సహాయంతో నెలల పాటు శ్రమించి C-46 విమాన శఖలాలను గుర్తించారు.

Also read:Crime News: లిఫ్ట్ లో అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం కుప్పకూలి ఉంటుందని, 13 మంది ప్రయాణికులలో ఒకరైన బ్రతికి బయటపడ్డా చుట్టూ మంచుకొండలు ఉండడంతో ఎక్కువ సమయం జీవించి ఉండకపోవచ్చని కుహ్లెస్ చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రి మరణానికి కారణమైన విమానానన్ని గుర్తించడంతో బిల్ షెరెర్ కాస్త భావోద్వేగానికి గురైయ్యాడు. “తనకు 13 నెలల వయసున్నప్పుడు తండ్రి విమాన ప్రమాదంలో తప్పిపోయాడని, అప్పటి నుంచి తన తల్లే అన్నీ అయి పోషించిందని” న్యూస్ ఏజెన్సీ AFPకి పంపిన మెయిల్ లో బిల్ షెరెర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ అన్వేషణలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ చేరుకున్న బృందంలో ముగ్గురు గైడ్లు “హైపోథర్మియా (hypothermia)”కు గురై సెప్టెంబర్లో మృతి చెందారు.

Also read: Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు

ట్రెండింగ్ వార్తలు