MLA Babu Jandel : పుట్టినరోజు నాడు దండలు వేయద్దని మెడలో పామును చుట్టుకున్న ఎమ్మెల్యే

ఆ ఎమ్మెల్యే తన పుట్టినరోజుని వింతగా జరుపుకున్నారు. మెడలో పూలదండలు వేయాలనుకున్న కార్యకర్తలను వద్దని వారించి పామును చుట్టుకున్నారు. ఎవరా ఎమ్మెల్యే? చదవండి.

MLA Babu Jandel

MLA Babu Jandel : ఓ ఎమ్మెల్యే పుట్టినరోజుని విచిత్రంగా జరుపుకున్నారు. కార్యకర్తలు వేసే పూల దండలు నిరాకరించి ఓ పాముని మెడలో వేసుకున్నారు. షాకయ్యారా? చదవండి.

Strange Disease : ఈ వింతవ్యాధి సోకితే డ్యాన్స్ చేస్తునే ఉంటారట..! డ్యాన్స్ చేస్తునే చనిపోతారట..!!

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ తన పుట్టినరోజుని చాలా వెరైటీగా జరుపుకుని వార్తల్లోకెక్కారు. ఆయనకు విషెస్ అందించిన కార్యకర్తలు పూల దండలు వేయబోతే వాటిని వద్దని నిరాకరించారు. మెడలో నల్లటి పామును చుట్టుకుని అందరిని సంతోషంగా పలకరించిన వీడియో వైరల్ అవుతోంది. జనం ఈ వీడియో చూసి అవాక్కయ్యారు.

తన పుట్టినరోజుని చాలా సాధారణంగా జరుపుకుంటానని, జంతువులు తనకు స్నేహితులవంటివని, తమ పెరట్లో ఉన్న మల్లెపూల చెట్టు దగ్గరకు తరచుగా పాములు వస్తుంటాయని.. పాములు శివుడిని సూచిస్తాయని అందువల్లే తాను పామును మెడలో చుట్టుకున్నానని ఆయన మీడియాకు చెప్పారు. దేవుడి పట్ల తనకున్న భక్తికి ప్రతిరూపంగా మెడలో పాముని చుట్టుకుని పుట్టినరోజు జరుపుకున్నట్లు ఆయన చెప్పడం విశేషం. ఇక ఆయనను కలవడానికి వచ్చిన వారిలో పాములను పట్టే వ్యక్తి కూడా ఉన్నారట. ఓ పెట్టెలోంచి పాముని తీసుకుని జండేల్ మెడలో వేసుకున్నారు.

Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

జండేల్ చేసిన వింత పని గురించి అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈయన వరదల సమస్యలపై అసెంబ్లీలో కుర్తా చించుకుని నిరసన తెలిపారు. గతేడాది విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ స్తంభం ఎక్కారు. గాయకుడిగా.. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో డ్యాన్స్ చేసి ఎమ్మెల్యే బాబు జండేల్ వార్తల్లో నిలిచారు.