Mobiles Turnoff : విమానంలో ఫోన్లను స్విచ్ఛాఫ్, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారో తెలుసా?

విమాన ప్రయాణాల్లో మొబైల్ ఫోన్లను ఎందుకు స్విచ్ఛాఫ్ చేస్తారో తెలుసా? దానికి అసలు కారణాలు ఏంటో తెలుసా? విమానాల్లో ఫోన్లను స్విచ్చాఫ్ చేయడం, ఫ్లైట్ మోడ్ పెట్టడం తప్పనిసరి..

Mobiles Turnoff Airplane Mode : విమాన ప్రయాణాల్లో మొబైల్ ఫోన్లను ఎందుకు స్విచ్ఛాఫ్ చేస్తారో తెలుసా? దానికి అసలు కారణాలు ఏంటో తెలుసా? విమానాల్లో ఫోన్లను స్విచ్చాఫ్ చేయడం, ఫ్లైట్ మోడ్ లో పెట్టడం అనేది ఎప్పుటినుంచో వస్తోంది. ఎందుకు ఇలా చేస్తారంటే.. విమానానికి ఏమైనా ప్రమాదమా? అంటే అలాంటిదనే చెప్పాలి. మొబైల్ నెట్ వర్క్ కారణంగా విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ కంట్రోల్ తప్పుతుందట.. అందుకే విమానాల్లో ప్రయాణికులను తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ లేదా ఫ్లైట్ మోడ్‌లో తప్పనిసరిగా పెట్టమని అంటారు. విమానాలు నడిచే ప్రారంభ రోజుల్లో మొబైల్ ఫోన్ల కారణంగా విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థపై ప్రభావం పడేదట.. దాంతో విమానాలకు ప్రమాదం ఏర్పడొచ్చుని విమానం టేకాఫ్ సమయంలో ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అప్పటి వైమానిక వ్యవస్థ.. ఇప్పటి ఆధునిక వైమానిక వ్యవస్థ చాలా డెవలప్ అయింది. మొబైల్ ఫోన్ల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు విమానాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థకు చాలా తేడా ఉంది.

మొబైల్ ఫోన్ల ఇంటర్ ఫెరన్స్ ఉన్నప్పటికీ కూడ వైమానికి ఎలక్ట్రానిక్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయగలవు. మొబైల్ సిగ్నళ్లలో వినియోగించే బ్యాండ్, వేవ్ స్పెక్ట్రమ్‌లకు, విమానంలో కమ్యూనికేషన్ చానెళ్లకు చాలా తేడా ఉంది. విమానంలో మొబైల్ ఫోన్ కారణంగా ఇప్పటివరకు ఏ ఒక్క విమానం కూడా ప్రమాదానికి గురికాలేదనే చెప్పాలి. అయినప్పటికీ పాత నిషేధాన్ని వైమానిక రంగం ఫాలో అవుతోంది. విమానంలో మొబైల్ వినియోగంపై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎందుకో తెలుసా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విమానంలో మొబైల్ ఫోన్ వాడటం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. ఫోన్ల వల్ల విమానానికి ప్రమాదం జరగదు.. కానీ, పైలట్లు ఏటీసీ (ATC) తో మాట్లాడే సమయంలో ఫోన్ల సిగ్నల్స్ కారణంగా కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు రేడియో, టీవీలలో గరమని వచ్చే సౌండ్ మాదిరిగా శబ్దం వస్తుంది. ఇలాంటి సమయాల్లో పైలట్లు ఏటీసీ సంభాషణ సరిగా వినిపించకపోవచ్చు. ఈ సమయంలో పైలట్ల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా కొన్నిసార్లు ప్రమాదాలు కూడా దారితీయొచ్చు.. అందుకే విమానాలను టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో ప్రయాణికుల మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయమని చెబుతుంటారు.

డివైజ్‌లు, మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారమవుతుంటుంది. విమాన ప్రయాణంలోనూ ఈ రేడియో సిగ్నల్స్ ప్రసరిస్తుంటాయి. అందుకే ఈ సమయాల్లో ప్రయాణికులు తమ విమాన ప్రయాణానికి ముందు ఫోన్‌ను స్విచ్ ఫ్ చేయాలి.. లేదంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టడం తప్పనిసరి.. బ్రిటానికా వెబ్‌సైట్ ప్రకారం.. ఎయిర్‌లైన్స్ ఈ రేడియో సిగ్నల్స్‌తో విమానంలోని డివైజ్‌లు, సెన్సార్లు, నావిగేషన్ సహా ఇతర ప్రధాన వ్యవస్థలపై సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మీ మొబైల్ ఫోన్లను Airplane Mode మోడ్‌లో పెట్టుకోవడం ద్వారా విమాన ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించాలి. ప్రస్తుత విమాన టెక్నాలజీలో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను రేడియో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ పడకుండా అడ్డుకుంటాయి. ఈ సందర్భాల్లోనే ముందు జాగ్రత్తగా ఫోన్‌లను ఆఫ్‌ చేయడం, ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టమని సూచిస్తారు. 2000 ఏడాదిలో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కారణమని అభిప్రాయపడుతున్నారు.

Read Also : Muralidhara Rao : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఘటన కుట్రే : మురళీధరరావు

ట్రెండింగ్ వార్తలు