Uddhav Thackeray: “మోదీ లేకపోతే గుజరాత్ ఉండదు” బాల థాకరే వ్యాఖ్యలను బయటపెట్టిన సీఎం ఉద్ధవ్

అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ.."మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)" అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు

Uddhav Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ సభలో మాట్లాడిన ఉద్ధవ్ థాకరే..తన తండ్రి, శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాకరే – బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ మధ్య జరిగిన ఓ సంభాషణను గురించి ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గోధ్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. గోద్రా అల్లర్ల అనంతరం మోదీ హటావో అనే నినాదాలు గుజరాత్ వ్యాప్తంగా వినిపించాయి. దీంతో రక్షణలో పడ్డ బీజేపీ అధిష్టానం..మోదీని తొలగించాలా? అనే ఆలోచనలో పడిందని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఒక ర్యాలీ నిమిత్తం ముంబైకి వచ్చిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ..శివసేన వ్యవస్థాపకులు బాల థాకరేను కలిసి మోదీని పక్కకు తప్పించే విషయమై చర్చించినట్లు సీఎం ఉద్ధవ్ చెప్పుకొచ్చారు.

Also read:Drugs Supply In Courier : విజయవాడలోని కొరియర్‌ ద్వారా డ్రగ్స్ సప్లయ్ కేసులో విచారణ వేగవంతం

అయితే అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ..”మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)” అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు. అప్పటికి మోదీ ప్రధాని పదవి దరిదాపుల్లో కూడా లేరని, హిందుత్వం కోసం తమ మద్దతు కోసమే బాలాసాహెబ్ మోదీకి మద్దతుగా నిలిచారని సీఎం ఉద్ధవ్ అన్నారు. ఇప్పటికీ ప్రధాని మోదీతో తమకు సత్సంబందాలే ఉన్నాయన్న సీఎం ఉద్ధవ్, బీజేపీ కూటమిలో కలిసే ఆలోచన మాత్రం లేదని అన్నారు. కాగా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలను రాష్ట్రాలపై ఉసిగొల్పుతుందని విమర్శించారు. పశ్చిమబెంగాల్ లో ఆయా కేంద్ర సంస్థలను నిషేదించినట్లుగా..త్వరలో మహారాష్ట్రలోనూ నిషేధం విధించాల్సి ఉంటుందని సీఎం ఉద్ధవ్ థాకరే కేంద్రాన్ని హెచ్చరించారు.

Also read:Permission for Indians: భారత్‌లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి

ట్రెండింగ్ వార్తలు