Drugs Supply In Courier : విజయవాడలోని కొరియర్‌ ద్వారా డ్రగ్స్ సప్లయ్ కేసులో విచారణ వేగవంతం

ఈ కేసులో తేజ, సాయిగోపికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది విచారణ చేస్తున్నామన్నారు. బెంగళూరు పోలీసులు ఇచ్చిన..(Drugs Supply In Courier)

Drugs Supply In Courier : విజయవాడలోని కొరియర్‌ ద్వారా డ్రగ్స్ సప్లయ్ కేసులో విచారణ వేగవంతం

Drugs Supply In Courier

Drugs Supply In Courier : కొరియర్ ద్వారా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో విచారణ వేగవంతం చేశామని విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ భాషా తెలిపారు. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఓ బృందాన్ని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి, మరో బృందాన్ని హైదరాబాద్ కు, ఇంకో టీమ్ ని బెంగళూరుకి పంపామన్నారు. ఈ కేసులో తేజ, సాయిగోపికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది విచారణ చేస్తున్నామన్నారు. తేజ కుటుంబ సభ్యులను పిలిచి విచారిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తేజను బెంగళూరు కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఏసీపీ వెల్లడించారు. విజయవాడలో ఉన్న కొరియర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తామని ఏసీపీ తెలిపారు.

Gujarath : గుజరాత్​లో పాకిస్తాన్‌కు చెందిన పడవలో నుంచి రూ.280 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించారు. దీని గురించి పోలీసులు ఆరా తీయగా విజయవాడలోని కొరియర్ సర్వీస్ పేరు తెరపైకి చ్చింది. ఈ పార్సిల్‌ను విజయవాడ డీటీఎస్‌ కొరియర్‌ నుంచి ఆస్ట్రేలియాకు పంపగా వివరాలు సరిగా లేక కెనడాకు వెళ్లింది. కెనడా నుంచి వెనక్కి వస్తుండగా.. బెంగళూరులో డ్రగ్స్‌ పార్సిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అందులో నాలుగు కేజీల డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.(Drugs Supply In Courier)

Drugs Supply Through Courier, Vijayawada Police Speedup Investigation

Drugs Supply Through Courier, Vijayawada Police Speedup Investigation

దీనికి సంబంధించి కొరియర్‌ బాయ్‌ తేజను గత నెల 27న బెంగళూరు పిలిపించిన కస్టమ్స్‌ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా కొరియర్‌ కార్యాలయంలో సాయిగోపి ఇచ్చిన ఆధార్‌ కార్డు నకిలీదని తేలింది. పట్టుబడిన పార్సిల్‌లో పిరిడిన్‌ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. అనంతరం కస్టమ్స్‌ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు.

స్థానిక పోలీసులు దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సాయిగోపి ఇటీవల రెండు సార్లు పచ్చళ్ల పార్సిల్స్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా ఇప్పటి లాగే డ్రగ్స్‌ను పంపాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇటీవల గుజరాత్‌లోని ఓ పోర్టులో పట్టుకున్న డ్రగ్స్‌ను పంపిన చిరునామా విజయవాడలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Drugs Supply Through Courier, Vijayawada Police Speedup Investigation

Drugs Supply Through Courier, Vijayawada Police Speedup Investigation

Hyderabad Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

గుజరాత్ ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో విజయవాడకు ప్రమేయం ఉందన్న వార్తలు కలకలం రేపాయి. డ్రగ్స్ పై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్‌ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధిలోని ఇంటి నెంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంట్లో సోదాలు చేశారు.