Permission for Indians: భారత్‌లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి

మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మనకు కూడా ప్రత్యేక పర్మిషన్ కావాలనే సంగతి మిలో ఎవరికైనా తెలుసా?. ఏంటి..మన దేశంలో మనం తిరగడానికి కూడా అనుమతి కావాలా..అని ఆశ్చర్య పోతున్నారా

Permission for Indians: భారత్‌లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి

Ilp

Permission for Indians: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా కావాలన్న సంగతి తెలుసు కదా. భద్రత కారణాలు, దౌత్యపరమైన పరిమితులకు లోబడి ఆయా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..ఈ ఏర్పాటు ఉంటుంది. అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మనకు కూడా ప్రత్యేక పర్మిషన్ కావాలనే సంగతి మీలో ఎవరికైనా తెలుసా?. ‘ఏంటి..మన దేశంలో మనం తిరగడానికి కూడా అనుమతి కావాలా..అని ఆశ్చర్య పోతున్నారా?’ అవును మరి, దేశ భద్రత దృష్ట్యా, భారత దేశ ఏకీకరణ సమయంలో జరిగిన ఒప్పందాల మేరకు..భారత్ లో కొన్ని ప్రాంతాలకు వెల్లాల్లంటే భారతీయులకు సైతం కొన్ని పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆప్రాంతాల వివరాలు ఏంటో చూద్దాం.

అరుణాచల్ ప్రదేశ్: అద్భుతమైన పర్వతాలు, జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు, నిర్మలమైన సరస్సులు మరియు ప్రసిద్ధ మఠాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్. ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అరుణచల్ ప్రదేశ్ అద్భుతమైన గమ్యస్థానంగా కొనసాగుతుంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లో అన్ని ప్రాంతాలను సందర్శించాలంటే భారతీయలకు సైతం ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) పర్మిట్ ఉండాలి. అరుణాచల్ ప్రదేశ్..భూటాన్, చైనా మరియు మయన్మార్‌ దేశాలతో సరిహద్దులను పంచుకోవడమే ఇందుకు కారణం. ఇక్కడ నిత్యం సరిహద్దు భద్రతా దళాలు గస్తీ తిరుగుతూ ఉంటారు.

Also read:Edible Oil: దేశంలో సరిపడా నూనె నిల్వలున్నాయి: కేంద్రం

మిజోరం: ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం మిజోరాం. భారతదేశంలోని ఐదవ అతి చిన్న రాష్ట్రం అయిన మిజోరాంలో చూసేందుకు చాలా రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. విభిన్న చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా మిజోరాం గురించి చెపుకోవచ్చు. అయితే, ఈ రాష్ట్రాన్ని సందర్శించడం భారతదేశంలోని ఇతర ప్రదేశాలను సందర్శించినంత అనుకూలమైనది కాదు. బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య ఉన్న మిజోరాంను సందర్శించాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి. సిల్చార్, కోల్‌కతా, గౌహతి, షిల్లాంగ్ మరియు న్యూఢిల్లీలో ఉండే మిజోరాం ప్రభుత్వ లైజన్ ఆఫీసర్ ద్వారా ఈ పర్మిట్ పొందవచ్చు.

నాగాలాండ్: పచ్చని ప్రకృతి, కొండవాలు ప్రాంతాలతో ఎంతో చూడచక్కని ప్రదేశం నాగాలాండ్. సాహసయాత్రలకు వెళ్లేవారు ఒక్కసారైనా నాగాలాండ్ పర్యటనకు వెళ్లాలని ఉవ్విళూరుతుంటారు. ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలకు నాగాలాండ్ పుట్టినిల్లు. నాగాలాండ్ మనదేశంలో ఒక రాష్ట్రమే అయినప్పటికీ ఇక్కడకి వెళ్లాలంటే కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. నాగాలాండ్‌లో భద్రత కారణాల దృష్ట్యా ఈ అనుమతి తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కోహిమా, దిమాపూర్, న్యూ ఢిల్లీ, మోకోక్‌చుంగ్, షిల్లాంగ్ మరియు కోల్‌కతా డిప్యూటీ కమిషనర్ల నుండి సందర్శకులు ఈ ఐఎల్‌‌పీ పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా అనుమతిని పొందవచ్చు.

Also Read:Hindu Country: హిమాలయాలు, హిందూ మహా సముద్రం మధ్య నివసించేవారందరు హిందువులే: కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌

సిక్కిం: సిక్కిం ఈశాన్య భారతదేశంలోని ఒక అందమైన రాష్ట్రం. హిమాలయాల పాదముద్రగా చెప్పుకునే సిక్కింలో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే, సిక్కింలో కొన్ని ప్రాంతాలను మాత్రం ఎటువంటి పర్మిట్ లేకుండానే సందర్శించవచ్చు. నాథులా పాస్ టూర్, సోమ్‌గో-బాబా మందిర్ ట్రిప్, ద్జోంగ్రీ హైక్, సింగలీలా ట్రెక్, యుమెసామ్‌డాంగ్, గురుడోంగ్‌మార్ సరస్సులో విహారం, యుమ్‌తాంగ్ మరియు జీరో పాయింట్ ట్రిప్ మరియు థంగు-చోప్తా వ్యాలీ ట్రిప్‌ వంటి ప్రాంతాలను సందర్శించాలంటే మాత్రం అనుమతులు అవసరం ఉంటుంది. కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖ ఈ అనుమతులను జారీ చేస్తుంది.

లక్షద్వీప్: భారత దేశంలో అంతర్భాగంమైన లక్షద్వీప్ గురించి కొందరికి అవగాహన లేదు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ హిందూ మహాసముద్రంలో ఒక అందమైన ద్వీపం. బిజీ జీవితం నుంచి ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలంటే లక్షద్వీప్ చక్కనైన ప్రాంతం. సముద్రం మధ్యలో ఉండే లక్షద్వీప్ ద్వీపం..అందమైన సముద్రం తీర ప్రాంతంతో పాటు అనేక రకాల పక్షులు మరియు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. సుందరమైన ఈ ద్వీపానికి చేరుకోవడం అంత సులభం కాదు.
లక్షద్వీప్‌ను సందర్శించడానికి, పర్యాటకులు తప్పనిసరిగా భారత కేంద్రపాలిత ప్రాంతం నుండి అనుమతిని పొందాలి.
అయితే పైన పేర్కొన్న ప్రాంతాలను సందర్శించాలంటే భారతీయులకు మాత్రమే పర్మిట్ అవసరం ఉంటుంది. భారతీయ వీసాపై ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మాత్రం ఎటువంటి పర్మిట్ అవసరం లేకపోవడం గమనార్హం.

Also read:Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి