Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..

Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి

Covid In India

Coronavirus: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలా ప్రకారం.. ఆదివారం కొత్తగా 3,324 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్ భారినపడి 40మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గినప్పటికీ 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావటం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన 24గంటల్లో కొవిడ్ నుంచి 2,876 మంది కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 19,092కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,23,843కు చేరుకోగా, మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,30,79,188గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 4,25,36,253గా ఉంది.

India Covid-19 : దేశంలో 3,688 కొత్త కేసులు, ఢిల్లీలో కరోనా కలవరం..!

కొవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా శనివారం 25,95,267 మందికి వైద్యసిబ్బంది టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,17,69,346 కు చేరింది. ఇదిలా ఉంటే కరోనా ఫోర్త్‌ వేవ్‌ భయాల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. జపాన్, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ పరీక్ష తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయంలోనే ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తారు. ఆస్ట్రేలియా, వియత్నాం, న్యూజిలాండ్‌ నుంచి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారు. కొవిడ్ వ్యాప్తి పెరగడకుండా ప్రభుత్వం అన్నిజాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ కొవిడ్ తీవ్రత పెరుగుతున్న రాష్ట్రాల ను అప్రమత్తం చేసిన విషయం విధితమే.