Edible Oil: దేశంలో సరిపడా నూనె నిల్వలున్నాయి: కేంద్రం

దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెల నిల్వలు ఉన్నాయని వెల్లడించింది కేంద్రం. ప్రస్తుతం 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని, ఈ నెలలో మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల నూనెలు రానున్నాయని కేంద్రం చెప్పింది.

Edible Oil: దేశంలో సరిపడా నూనె నిల్వలున్నాయి: కేంద్రం

Edible Oil

edible oil: దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెల నిల్వలు ఉన్నాయని వెల్లడించింది కేంద్రం. ప్రస్తుతం 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని, ఈ నెలలో మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల నూనెలు రానున్నాయని కేంద్రం చెప్పింది. దేశంలో ప్రస్తుతం వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిరంతరం సమీక్ష జరుపుతోంది. వంట నూనెల ఉత్పత్తిదారులతో ధరల నియంత్రణ, ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై చర్చ జరుపుతూనే ఉంది. కానీ, పామాయిల్ ఎగుమతుల్ని ఇండోనేషియా నిషేధించడంతో మరోసారి ధరలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఏర్పడింది.

India Border: పాకిస్తాన్ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ చైనా’ డ్రోన్ కూల్చివేసిన భారత భద్రతా దళాలు

దీనిపై ఆందోళన అవసరం లేదని కేంద్రం చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో ఆవగింజల ఉత్పత్తి 37 శాతం పెరిగిందని, దీనితోపాటు సోయాబీన్ ఉత్పత్తి కూడా పెరిగిందని చెప్పింది. దీంతో వంట నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మన దేశం వంట నూనెల కోసం చాలావరకు విదేశాల మీదే ఆధారపడుతోంది. దిగుమతుల్లో పామాయిల్ 62శాతం, సోయాబీన్ ఆయిల్ 22 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా వంటనూనెల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతోపాటు ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, పన్నులు కూడా వంట నూనెల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి.ఈ నేపథ్యంలో దేశంలో సరిపడా నూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టంచేసింది.