Good News Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. అదేమిటంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Good News Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో డీఏ పెంపు నిర్ణయానికి ఆమోదం లభించినట్లు తెలిసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపుపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో బుధవారం సమావేశంలో పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

CM KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు.. దసరా రోజు పార్టీ పేరును ప్రకటించనున్న టీఆర్ఎస్ అధినేత..!

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో డీఏ మొత్తం 38శాతానికి చేరనుంది. ప్రభుత్వం గతంలో మార్చి నెలలో కేంద్ర ఉద్యోగుల డీఏను 3శాతం పెంచింది. 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల డీఏ 31శాతం నుంచి 34శాతంకు పెరిగింది. తాజాగా డీఏను మరో 4శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో కేంద్ర ఉద్యోగులకు డీఏ 38శాతంకు చేరుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 50లక్షల మంది ఉద్యోగులు, 62లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

లెక్కల ప్రకారం.. ఉద్యోగుల డీఏను ప్రభుత్వం 34 శాతం నుంచి 38 శాతానికి పెంచింది. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం ఇప్పుడు రూ. 18,000 అయితే 34శాతం చొప్పున డీఏ రూ. 6,120 అవుతుంది. అదే సమయంలో తాజాగా పెంచిన 4శాతం పెంపు పొందితే రూ. 6,840 అవుతుంది. ఇదిలాఉంటే ప్రతీయేటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను సవరిస్తూ ఉంటుంది. తాజాగా కేంద్రం డీఏ పెంపుతో రాష్ట్రాలుసైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు