CM KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు.. దసరా రోజు పార్టీ పేరును ప్రకటించనున్న టీఆర్ఎస్ అధినేత..!

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. కొతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. అందుకోసం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.

CM KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు.. దసరా రోజు పార్టీ పేరును ప్రకటించనున్న టీఆర్ఎస్ అధినేత..!

CM KCR National Party: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. కొతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. అందుకోసం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. పలు దఫాలుగా పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనల అనంతరం సీఎం కేసీఆర్ దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దసరా రోజు టీఆర్ఎస్ఎల్పీ, పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్న సీఎం కేసీఆర్.. సమావేశంలో ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయంతో అదేరోజు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటనతో పాటు పార్టీ పేరును ప్రకటించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

CM KCR – PK TEAM : ప్రశాంత్ కిషోర్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి .. పీకే టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చెప్పారా?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి కేంద్రంలో పాగా వేస్తామని, అధికారంలోకి రాగానే తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ సైతం కేసీఆర్ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేఖ పార్టీలతో కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల బీహార్ వెళ్లిన సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు, లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలు, పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ్‌లతోనూ సీఎం కేసీఆర్ పలు దఫాలుగా భేటీ అయ్యి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అదేవిధంగా సెప్టెంబర్ 16న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ ఏర్పాటుపైనా సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇటీవలి కాలంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేఖ కూటమి ఏర్పాటుకు వారు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.  దీంతో  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆశలకు గండిపడినట్లు ప్రచారం జరిగింది.  సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను విరమించుకుంటారన్న ప్రచారం జరిగింది. తాజాగా దసరా రోజు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవ్వడంతో మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చకు తెరతీసింది.