తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు మోడీజీ

ఢిల్లీలోని ప్రభుత్వ భవనమైన ‘శాస్త్రి భవన్‌’లోని ఆరో అంతస్తులో మంగళవారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది.సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది నిమిషాల్లోనే మంటలను ఆర్పేశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్టు ఇంతవరకూ సమాచారం లేదు. ప్రమాద కారణం కూడా తెలియాల్సి ఉంది.

అయితే ఈ అగ్నిప్రమాదం జరిగిన తర్వాత ప్రధాని మోడీ టార్గెట్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘మోడీజీ, తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు. మీ జడ్జిమెంట్ డే త్వరలోనే రాబోతోంది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.  న్యాయశాఖ, సమాచార-ప్రసార శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు, రసాయనాలు, పెట్రో కెమికల్స్, మానవ వనురల అభివృద్ధి మంత్రిత్వ శాఖలన్నీ శాస్త్రి భవన్‌ లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన ఫైళ్ల గిడ్డంగి (స్టోర్‌ హౌస్) కూడా ఈ భవనంలోనే ఉంది.
Also Read : ఆశారం బాపు కుమారుడికి జీవిత ఖైదు