ఆశారం బాపు కుమారుడికి జీవిత ఖైదు
అత్యాచారం కేసులో దోషి, స్వయం ప్రకటిత భగవంతుడిగా చెప్పుకునే ఆశారం బాపు కుమారుడు నారాయణ్ సాయికి జీవిత ఖైదు శిక్ష పడింది.

అత్యాచారం కేసులో దోషి, స్వయం ప్రకటిత భగవంతుడిగా చెప్పుకునే ఆశారం బాపు కుమారుడు నారాయణ్ సాయికి జీవిత ఖైదు శిక్ష పడింది.
అత్యాచారం కేసులో దోషి, స్వయం ప్రకటిత భగవంతుడిగా చెప్పుకునే ఆశారం బాపు కుమారుడు నారాయణ్ సాయికి జీవిత ఖైదు శిక్ష పడింది. అత్యాచారం కేసులో ఆశారాం బాపు కుమారుడికి మంగళవారం గుజరాత్ సూరత్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సూరత్ కు చెందిన మహిళ భక్తురాలిపై అత్యాచారం చేయడంతో నారాయణ్ సాయిని 2013లో పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్ లోని ఆశారం ఆశ్రమంలో ఉంటున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నారాయణ్ పై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.
Also Read : తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!
ఈ కేసుపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జీవిత ఖైదుతో పాటు నారాయణ్ సాయికి కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ కేసులో మిగిలిన నలుగురు దోషులకు 10ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించింది. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) సహా పలు సెక్షన్ల కింద కోర్టు నారాయణ్ సాయిని దోషిగా తేల్చింది.
2013లో రాజస్థాన్ లో బాలికపై అత్యాచారం, ఇద్దరు సూరత్ మహిళల ఆరోపణలతో తండ్రి ఆశారం బాపును పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో ఆశారంతో సహా తన అనుచరులను అప్పట్లో జోధాపూర్ కోర్టు దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోధాపూర్ సెంట్రల్ జైల్లో ఆశారం బాపు జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.
Also Read : వామ్మో.. ఎంత పెద్దదో : నడిరోడ్డుపై భారీ అనకొండ.. ట్రాఫిక్ జామ్