PM Modi
PM Narendra Modi: నేటి నుంచి 11వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.14,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నేటి నుంచి గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ, 11న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది చివరిలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ పర్యటన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మెహ్సానాలోని మోధేరాలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. మోధేరాను భారతదేశం యొక్క మొట్టమొదటి 24×7 సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధాని మోదీ ప్రటించనున్నట్లు తెలిసింది. మోధేరాలోని సన్ టెంపుల్ టౌన్‌ను సోలారైజేషన్ చేయాలనే మోదీ కోరిక తీరనుంది.
David Miller: విషాదంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియో
ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్-మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్. నివాస, ప్రభుత్వ భవనాలపై 1,300 కంటే ఎక్కువ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం జరిగింది. అన్నీ బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో స్థానిక ప్రజలు 60శాతం నుంచి 100శాతం విద్యుత్ బిల్లులను ఆదా చేస్తారని గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, బెచరాజి తాలూకాలోని మోధేరా గ్రామంలో 6,373 మంది జనాభా ఉన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా.. సోమవారం బరూచ్, అహ్మదాబాద్, జామ్‌నగర్‌లోని అమోద్‌లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి, మరుసటి రోజు ఉజ్జయినిలోని శ్రీమహాకాళేశ్వర ఆలయానికి వెళ్లనున్నారు. తర్వాత మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఆధునిక సౌకర్యాలను అందించే మహాకాల్ లోక్ ప్రారంభోత్సవం జరుగుతుంది.