పద్మశ్రీకి ఎంపిక చేశారు, ఇంకా ఇవ్వలేదు..కటిక పేదరికంతో బాధ పడుతున్న షరీఫ్ చాచా

పద్మశ్రీకి ఎంపిక చేశారు, ఇంకా ఇవ్వలేదు..కటిక పేదరికంతో బాధ పడుతున్న షరీఫ్ చాచా

Updated On : February 21, 2021 / 9:30 AM IST

Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం వచ్చిందని, కానీ..ఇంతవరకు ఆ అవార్డు ఇవ్వకపోగా..కటిక పేదరికంతో..తన తండ్రి మంచాన పడ్డాడని అతని కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్ ప్రాంతంలో మొహమ్మద్ షరీప్ నివాసం ఉంటున్నారు. ఇతని వయస్సు 83 సంవత్సరాలు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేవాడు. దీంతో అందరూ..‘షరీఫ్ చాచా’ అని అప్యాయంగా పిలిచేవారు. అనాథలకు షరీఫ్ అందించిన సేవలకు గాను..‘పద్మశ్రీ’ ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం వచ్చిందని తెలిపాడు షరీఫ్ కుమారుడు షగీర్. ఇప్పటికీ ఆ అవార్డు అందలేదన్నారు.

తన తండ్రి పేరు సిఫార్సు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ. 7 వేల జీతం మాత్రమే వస్తుందన్నారు. కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పేదరికం కారణంగా..తన తండ్రికి వైద్యం చేయించుకోలేకపోతున్నట్లు, తండ్రికి ఫించన్ మంజూరు చేయాలని షగీర్ కోరుతున్నాడు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.