ఈవీఎంలపై ఈసీకి కాంగ్రెస్ 39 ఫిర్యాదులు

ముంబై : సార్వత్రిక తొలి దశ ఎన్నికల పోలింగ్ లో తలెత్తిన ఈవీఎంల మోరాయింపుపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 12:14 PM IST
ఈవీఎంలపై ఈసీకి కాంగ్రెస్ 39 ఫిర్యాదులు

ముంబై : సార్వత్రిక తొలి దశ ఎన్నికల పోలింగ్ లో తలెత్తిన ఈవీఎంల మోరాయింపుపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

ముంబై : సార్వత్రిక తొలి దశ ఎన్నికల పోలింగ్ లో తలెత్తిన ఈవీఎంల మోరాయింపుపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని ఆరు లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మోరాయించాయి. పలు పొలింగ్ బూత్ ల్లో మోరాయించిన ఈవీఎంలపై మొత్తం 39 ఫిర్యాదులను కాంగ్రెస్  ఎన్నికల కమిషన్ కు పంపింది.
Read Also : కొత్త రేటు గురూ : జూ కి వెళ్తే జేబు ఖాళీ

ఈసీకి పంపిన ఫిర్యాదుల్లో 12 ఫిర్యాదులను ఈమెయిల్ ద్వారా పంపినట్టు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. నాగ్ పూర్ లో కొన్ని పోలింగ్ బూత్ ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మోరాయించినట్టు తెలిపింది. చందర్ పూర్ లో ఎనిమిది ఫిర్యాదులు, వార్దాలో ఆరు, రామ్ టెక్ లో ఐదు ఫిర్యాదులు చేసినట్టు కాంగ్రెస్ పేర్కొంది. 

యవత్మాల్-వాషిం, గడ్చిరోలీ-చిమ్యూర్ స్థానాలకు జరిగిన పోలింగ్ లో నాలుగు ఫిర్యాదులు పంపినట్టు పార్టీ స్పష్టం చేసింది. ఆరు నియోజకవర్గాలు మాత్రమే కాకుండా.. విధర్భలోని బండారా-గోండ్యా స్థానంలో కూడా పోలింగ్ కొనసాగుతోంది.

నాగపూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంలను సరిగా ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారికి మరో లేఖలో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈవీఎంల సమస్యలపై విచారించి రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కోరుతున్నట్టు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ విజయ్ పాండే లేఖలో తెలిపారు.
Read Also : నిజామాబాద్ మినహా ముగిసిన పోలింగ్