Buying Gold : బంగారం కొంటున్నారా.. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, ఇలా చేస్తే మీకే లాభం

Things To Keep In Mind When Buying Gold : ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల, జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మోసపోకుండా ఉండొచ్చు. అదే సమయంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Things To Keep In Mind When Buying Gold (Photo : Google)

బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. గోల్డ్ తో మనోళ్లకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. మరీ ముఖ్యంగా మహిళలకు పుత్తడి అంటే ఎంతో మమకారం. మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంత రిచ్ అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఎక్కువ బంగారం కలిగి ఉండటాన్ని ఓ స్టేటస్ గా భావిస్తారు. మా దగ్గర ఇన్ని కిలోల బంగారం ఉందని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.

ఇక, గోల్డ్ ని మనోళ్లు కేవలం అలంకార వస్తువుగానే చూడటం లేదు పెట్టుబడి వస్తువుగానూ చూస్తున్నారు. అందుకే గోల్డ్ రేటు భారీగా పెరిగిపోతోంది. జీవితంలో అంతో ఇంతో పసిడి కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరి కల. తమకు వచ్చే ఆదాయంలో కాస్త డబ్బు ఆదా చేసి పసిడి కొంటుంటారు. ఇక పెళ్లి లాంటి శుభకార్యాలు, పండుగల సమయంలో అయితే కచ్చితంగా బంగారం కొనాల్సిందే. ఈ విషయంలో తగ్గేదే లేదంటారు.

Also Read : మొబైల్ యూజర్ల కోసం యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది.. ఇక మోసాలకు చెక్ పడినట్టే!

ఇకపోతే.. గోల్డ్ కొనే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అసవరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదో హడావుడిగా షాప్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసేసి పసిడి కొనేయడం కరెక్ట్ కాదంటున్నారు. కాస్త ముందూ వెనుక చూసుకోవాలని, కొన్ని జాగ్రత్తలు తప్పకుండా ఫాలో అవ్వాలని చెబుతున్నారు. లేదంటే నష్టపోవడం ఖాయమని, తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం లేదని అంటున్నారు.

Things To Keep In Mind When Buying Gold (Photo : Google)

ధంతేరస్ వచ్చేస్తోంది. ఈ పర్వదినాన బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు మన భారతీయులు. బంగారం కొనడం అంటే ఖర్చు కంటే పెట్టుబడి ఎక్కువ అని చెప్పాలి. ఇక బంగారాన్ని ఉపయోగించి అందమైన ఆభరణాలను తయారు చేయవచ్చు లేదా అవసరమైతే అమ్ముకోవచ్చు. అలా ఏ విధంగా చూసినా గోల్డ్ తో లాభమే. అయితే, మార్కెట్‌.. నకిలీలతో, మెటల్‌తో నిండి ఉంది. అది బంగారంలా కనిపిస్తుంది. కానీ పసిడి కాదు. కాబట్టి, డూప్లికేట్ మెటల్ గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు సురక్షితంగా ఉండటం కోసం, మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

ఇంతకీ గోల్డ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే అంశాలు తెలుసుకోవాలి? ఏ విధంగా మోసపోకుండా ఉండాలి? నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

Also Read : టీసీఎల్ మెగా దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌టీవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు.. వెంటనే కొనేసుకోండి!

బంగారం కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..

1.స్వచ్ఛతను తెలుసుకోండి:
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు. 99.9 శాతం బంగారంతో 24 క్యారెట్ స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛమైనది. ప్రతి క్యారెట్ బంగారం 4.2 శాతం స్వచ్ఛమైన బంగారంతో సమానం.

2.మేకింగ్ ఛార్జీలు:
మేకింగ్ ఛార్జీల విషయంలో కస్టమర్లు మోసపోయే ఛాన్స్ ఎక్కువ. ప్రతి బంగారు ఆభరణానికి మేకింగ్ ఛార్జీలు ప్రస్తుత బంగారం ధరలలో ప్రతిబింబిస్తాయి.

3. మానవ నిర్మిత లేదా యంత్రం నిర్మిత:
యంత్రంతో(మెషిన్) తయారు చేసిన ఆభరణాలు, మానవ నిర్మిత ఆభరణాల ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. యంత్రంతో తయారు చేయబడిన ఆభరణాల ధర చౌకగా ఉంటాయి.

4.బరువును చెక్ చేయండి:
బంగారు ఆభరణాలను తూకంలో విక్రయిస్తారు. ముక్క ఎంత బరువైతే అంత ధర ఎక్కువగా ఉంటుంది.

Things To Keep In Mind When Buying Gold (Photo : Google)

5. అమ్మకాలు:
బంగారం కొనుగోళ్లు పెరిగినప్పుడు వాటి ధరలు కూడా పెరుగుతాయి. అందువల్ల, ఆఫ్ సీజన్ లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు లేదా అనేక ఆఫర్‌లు ఉన్నప్పుడు బంగారం కొనడం మంచిది.

సో.. ఈసారి మీరు గోల్డ్ కొనాలని ప్లాన్ చేసినప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మోసపోకుండా ఉండొచ్చు. అదే సమయంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు