బీజేపీ ఎంపీ Ashok Gasti చనిపోలేదు – వైద్యులు

  • Publish Date - September 18, 2020 / 08:53 AM IST

Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.



అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టెంబర్ 17వ తేదీ గురువారం చనిపోయారంటూ..పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. దీనిపై మణిపాల్ వైద్య వర్గాలు స్పందించాయి. గాస్టి..తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనేది వాస్తవమే..ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
https://10tv.in/sexual-abuse-of-two-daughters-abused-mumbai-woman-smothers-alcoholic-husband-to-death/
అశోక్ 18 ఏళ్ల వ‌య‌సులో బీజేపీ యువ మోర్చాలో చేరారు. కర్ణాటక బీజేపీకి చెందిన యువ మోర్చాకు నాయకత్వం వహించారు. ఏబివిపి కార్యకర్తగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యుడుగా కూడా పనిచేశారు.



2012లో బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ గా కూడా అశోక్ గస్తీ సేవలందించారు. ఇటీవలే అశోక్ గ‌స్తీ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఈ ఏడాది జులై 22న రాజ్య‌స‌భ ఎంపీగా అశోక్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.