రిపబ్లిక్ డే…ప్రసంగ సమయంలో తడబడ్డ మంత్రి

రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా శనివారం(జనవరి 26,2019) మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్‌లో ఎస్ఏఎఫ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

  • Publish Date - January 26, 2019 / 09:24 AM IST

రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా శనివారం(జనవరి 26,2019) మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్‌లో ఎస్ఏఎఫ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా శనివారం(జనవరి 26,2019) మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్‌లో ఎస్ఏఎఫ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సభను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమారతి దేవి అర్థాంతరంగా తన ప్రసంగాన్ని ఆపేశారు. కార్యక్రమంలో మాట్లాడేందుకు ఆమె ప్రసంగాన్ని రాసుకుని వచ్చారు. అయితే దానిని చదివేటపుడు చాలా ఇబ్బంది పడ్డారు. తడబడుతూ ప్రసంగాన్ని చదివేందుకు ప్రయత్నించి ఇక తన వల్ల కాదని జిల్లా కలెక్టర్ భరత్ యాదవ్‌ను పిలిచి, తన ప్రసంగాన్ని చదవమని కోరారు.

దీంతో ఆమె ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 25న ఏర్పడిన సంగతి తెలిసిందే. 2008, 2013, 2018లలో వరసగా ముడు సార్లు ఎమ్మెల్యేగా ఇమారతి దేవి  ఎన్నికయ్యారు.

ట్రెండింగ్ వార్తలు