సంపాదనలో ఏపీ ఎంపీలే టాప్ 

  • Publish Date - April 1, 2019 / 09:44 AM IST

ఢిల్లీ : ప్రజా ప్రతినిధుల సంపాదనలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలే టాప్ లో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా ప్రతినిథుల ఆదాయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహించిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల సమయంలో ఆయా ప్రజాప్రతినిధులు సమర్పించిన ఆదాయ వివరాల అఫిడ్‌విట్ ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించటం జరిగింది.  
 

ముఖ్యంగా 16వ లోక్‌సభలోని 521 మంది ఎంపీల ఆదాయాలు..వారి వృత్తి వంటి పలు అంశాలపై ఏడీఆర్ స్టడీ చేసింది. ఎంపీల వ్యక్తిగత ఆదాయం జాతీయ సగటు 30.29 లక్షలు కాగా..ఏపీలోని 19 మంది లోక్‌సభ ఎంపీల అదాయం దీనికి మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఏపీ ఎంపీల సగటు ఆదాయం రూ.1.05 కోట్లుగా తేలింది. ఈ బాబితాలో తెలంగాణ ఎంపీలు రూ.30.6 లక్షలతో 11వ స్థానంలో నిలిచారు. 

జాతీయంగా ఎంపీల ఆదాయ వివరాలు (అఫిడ్‌విట్ ఆధారంగా)

  • అందరికంటే టాప్ లో చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ రూ.1.72 కోట్లు 
  • ఏపీ ఎంపీలు రూ.1.05 కోట్లు 
  • ఒడిశా ఎంపీలు 15 మంది (రూ.68.8 లక్షలు)
  • గుజరాత్ ఎంపీలు 24 మంది (రూ.59.5 లక్షలు)
  • పంజాబ్ ఎంపీలు 13 మంది (రూ.51.4 లక్షలు) 
  • చివరిస్థానంలో గోవా ఎంపీలు (రూ.5.2 లక్షలు)

తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆదాయ వివరాలు (అఫిడ్‌విట్ ఆధారంగా)

  • ఎంపీ గల్లా జయదేవ్ (గుంటూరు, టీడీపీ) రూ.16.85 కోట్లు
  • ఎస్పీవై రెడ్డి (వైసీపీ, నంద్యాల) రూ.1.86 కోట్లు 
  • కేశినేని నాని (విజయవాడ, టీడీపీ) రూ.2.06 కోట్లు
  • ఎంపీ గోడం నగేశ్ (ఆదిలాబాద్,టీఆర్ఎస్)రూ.1.52 కోట్లు    
  • జయంత్ సిన్హా (హజరీబాగ్,బీజేపీ ఎంపీ) రూ.3.67 కోట్లు 
  • వరుణ్‌గాంధీ (సుల్తాన్‌పూర్,బీజేపీ) రూ.2.78 కోట్లు
  • కిరణ్ ఖేర్ (చండీగఢ్ ఎంపీ )రూ.1.72 కోట్లు 

కాకినాడ తోట నర్సింహం, నాగర్‌కర్నూలు ఎంపీలు తమ వ్యక్తిగత ఆదాయ వివరాలను వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభలో కేవలం 12 శాతం మంది  అంటే 58 మంది మాత్రమే  మహిళలు ఉండగా..ఎంపీల్లో పురుషుల వ్యక్తిగత ఆదాయ సగటు రూ.30.54 లక్షలు కాగా మహిళలది రూ.28.46 లక్షలుగా ఉందని అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్ స్టడీ వెల్లడించింది.