6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. గోధుమ సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోకసభలో ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో క్వింటాల్ గోధుమల ధర రూ.1,975కు చేరింది.


వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినా.. కనీస మద్దతు ధర, ఎపీఎంసీ కొనసాగుతుందని స్పష్టం చేశారు తోమర్​. ఈ అంశాల్లో విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తోమర్​ తాజా ప్రకటన అనంతరం కాంగ్రెస్​ ఎంపీలు సభ నుంచి వాకౌట్​ చేశారు.విపక్షాల విమర్శలు..రాజ్యసభలో ఆదివారం ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై రగడ కొనసాగుతూనే ఉంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్​, హరియాణా సహా కొన్ని రాష్ట్రాల్లో రైతుసంఘాలు నిరసనలు చేపట్టాయి.


కనీస మద్దతు ధర పెరిగిన ఆరు రబీ పంటలు

గోధుమ : 50 రూపాయల పెరుగుదల

శనగపప్పు : 225 రూపాయల పెరుగుదల

ఎర్రపప్పు : 300 రూపాయల పెరుగుదల

ఆవాలు : 225 రూపాయల పెరుగుదల

బార్లీ : 75 రూపాయల పెరుగుదల

కుసుమ : 112 రూపాయల పెరుగుదల

ట్రెండింగ్ వార్తలు