Mukesh Ambani 20 years Reliance (1)
Mukesh Ambani 20 years Reliance : ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు అయ్యింది. ఈ 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో ఈ స్మార్ట్ మెన్ తీసుకున్న కీలక నిర్ణయాలు భారత్ ను స్మార్ట్ ఇండియాగా మార్చేసాయి. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే.. ఓ కంపెనీ బాధ్యతలు అప్పజెప్పాక.. ఆ కంపెనీని ఎలా మార్చాలి? నెంబర్ వన్ కంపెనీగా ఎలా మార్చాలి? అనే దాని మీదే ఫోకస్ పెడతారు? అతను తీసుకునే నిర్ణయాలతో.. కంపెనీ స్టేటస్ మారిపోతుంది. అందులో పనిచేసే ఉద్యోగుల లైఫ్ కూడా మారుతుంది. కానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముకేశ్ అంబానీ చేసే వ్యాపారం.. దేశ ప్రజలందరి జీవితాలపై ఇంపాక్ట్ చూపింది. జియోతో.. రిలయన్స్ తెచ్చిన డేటా రెవల్యూషన్.. టోటల్ ఇండియానే స్మార్ట్‌గా మార్చేసింది. అదొక్కటే కాదు.. అంబానీ 20 ఏళ్ల బిజినెస్ జర్నీలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాటుకొని వచ్చిన మైల్ స్టోన్స్ చాలానే ఉన్నాయ్.
ఎప్పుడైతే.. ముకేశ్ అంబానీ జియోతో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చారో.. అప్పుడే ఇండియాలో డేటా రెవల్యూషన్ మొదలైపోయింది. భారత్ మొత్తం ప్రపంచానికి డేటా క్యాపిటల్‌గా మారింది. వన్ జీబీ డేటా ధర కూడా అమాంతం పడిపోయింది. జియో రాక ముందు వన్ జీబీ డేటా 5 వందలుగా ఉండేది. దాన్ని.. చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. కానీ.. జియో వచ్చాక వన్ జీబీ డేటా ధర 12 రూపాయలకు పడిపోయింది. తర్వాత.. రోజుకు వన్ జీబీకి పైనే వాడేస్తున్నారు. 2 జీబీ, 3జీబీ వాడే వాళ్లు కూడా ఉన్నారు. ఇక.. ప్రపంచ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో.. 2016లో 150వ స్థానంలో ఉన్న భారత్.. 2018 నాటికి నెంబర్ వన్ పొజిషన్‌కు చేరింది. ఇదంతా.. జియో పుణ్యమే. వందల్లో ఉన్న వన్ జీవీ డేటా.. 12 రూపాయలకే లభిస్తుందంటే.. అదంతా అంబానీ ఆలోచనే. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఇండియాని.. స్మార్ట్ ఇండియాగా మార్చేసింది.
2006లో రిటైల్ విక్రయ వ్యాపారంలోకి ప్రవేశించిన రిలయన్స్.. 2016లో టెలికాంలోకి, 2021లో న్యూ ఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద రిటైల్ కంపెనీ.. రిలయన్స్ రిటైల్. టెలికాం విభాగమైన రిలయన్స్ జియో కూడా దేశంలోనే.. నెంబర్ వన్ మొబైల్ సర్వీస్ కంపెనీ. నిధుల సమీకరణలోలోనూ.. రిలయన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు సృష్టించింది. రైట్స్ ఇష్యూ, జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో.. మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రెండున్నర లక్షల కోట్లు సమీకరించింది. పెట్టుబడులు పెట్టిన వాటిలో.. ఫేస్‌బుక్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయ్. 2021లో భారత్‌కు ఎఫ్‌డీఐలు వెల్లువెత్తడంలో రిలయన్స్‌దే కీ రోల్.
సంపాదన మాత్రమే కాదు దాతృత్వంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే నెంబర్ వన్ పొజిషన్. 2010లో రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు ముకేశ్ అంబానీ. ఆయన సతీమణి నీతా అంబానీ దీని కార్యకలాపాలు చూస్తారు. గ్రామీణ సాధికారిత, పౌష్టికాహార భద్రత, విద్య, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది. వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని 6 కోట్ల 30 లక్షల మందికి పైగా ప్రజల జీవితాలను.. ఈ ఫౌండేషన్ తాకింది. భారత్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద.. అత్యధికంగా ఖర్చు చేస్తున్న సంస్థ రిలయన్స్ ఒక్కటే.
2007లోనే ముకేశ్ అంబానీ సంపద లక్ష కోట్లు దాటింది. అప్పటికే.. భారత్‌లో లక్ష కోట్లకు పైగా ఆస్తి కలిగిన ఏకైక వ్యక్తి ముకేశ్ మాత్రమే. అప్పటి నుంచి 2021 వరకు ఆయనే దేశంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగారు. కొన్ని నెలల క్రితం.. ఆ స్థానానికి గౌతమ్ అదానీ చేరడంతో.. ముకేశ్ వెనుకబడ్డారు. కానీ.. అదానీని దాటి అంబానీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరడానికి ఇంకెంతో సమయం పట్టదని కూడా బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుత శతాబ్దం భారత్‌దేనన్న ముకేశ్ అంబానీ.. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని చెబుతుంటారు. అంతేకాదు.. రాబోయే 25 ఏళ్లలో.. ఇండియాలో విప్లవాత్మకమైన మార్పులు చేటు చేసుకుంటాయంటున్నారు. భవిష్యత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా.. మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.