Mukesh Ambani: ముఖేశ్ అంబానీ చూపు మరో బడా బిజినెస్ వైపు

ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ.. మరో బడా బిజినెస్ కు ప్రణాళికలు రెడీ చేశారు. సోలార్ పవర్‌లో టాటా, అదానీ లాంటి వాళ్లను దాటుకుని వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.

Mukesh Ambani: ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ.. మరో బడా బిజినెస్ కు ప్రణాళికలు రెడీ చేశారు. సోలార్ పవర్‌లో టాటా, అదానీ లాంటి వాళ్లను దాటుకుని వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. బిజినెస్ డెవలప్మెంట్ కు ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది రిలయన్స్‌. పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75వేల కోట్లు పెట్టుబడులతో రెడీ అయింది.

సోలార్‌ సెల్స్‌ తయారీ ప్లాంట్లు, పవర్ స్టోరేజ్ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యూయెల్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌, హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌లను ఏర్పాటు చేయనుంది. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ గల ప్లాంట్లను, కార్బన్‌ ఫైబర్‌ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం రిలయన్స్‌ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్‌ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది.

2035 నాటికి పూర్తిగా కర్బన్‌ ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్‌ గతేడాదే ప్లాన్ చేసుకుంది. ఈ దిశగా వ్యూహాలు, గైడ్ లైన్స్ ప్లానింగ్ లను ముందుంచుతున్నట్లు గురువారం వెల్లడించారు. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని, ఇందులో భాగంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నామని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు