ములాయంకు తీవ్ర అస్వస్థత…ముంబైకి తరలింపు

సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌(80) యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా తర్వాతే హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్‌ చేసేది సాయంత్రంలోగా తెలియజేస్తామని డాక్టర్లు తెలిపారు.

దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన ములాయం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996-1998 మధ్యకాలంలో రక్షణశాఖ మంత్రిగా, 1989-91,1993-1995, 2003-2007 కాలంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ములాయం కూడా సుప్రసిద్దుడే. బద్దవిరోధిగా కొనసాగుతూ వచ్చిన బీఎస్పీతో చేతులో ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటకీ బీజేపీ ఎత్తుల ముందు ఎస్పీ-బీఎస్పీ కూటమి వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు