Mumbai Drugs Case Court Rejects Bail Plea Of Aryan Khan
Aryan Khan Denied Bail Mumbai Court : బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్యన్ సహా ఎనిమిది మందికి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఆర్యన్ తరఫు న్యాయవాది మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 8)న వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్ సహా అర్భాజ్ ఖాన్, మూన్‌మూన్ ధమేచలకు బెయిల్ తిరస్కరించారు. అయితే బెయిల్ కోసం సెషన్ కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది కోర్టు. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వరాదని ఎన్సీబీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టును అభ్యర్థించారు.
Gun Fire: మూత్రం పోస్తుండగా ప్యాంటు జేబులో పేలిన గన్..పరిస్థితి ఎలా ఉందంటే..
బెయిల్ పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని వాదనలు వినిపించారు. మరోవైపు, అర్భాజ్ ఖాన్ న్యాయవాది బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ శనివారం (అక్టోబర్ 9) వేయనున్నారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన మూన్మూన్ ధమేచా న్యాయవాది మాట్లాడుతూ.. మూన్మన్ మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా పేర్కొన్నారు. ముంబైకి ఆమెను ఆహ్వానించడం వల్లే ఇక్కడికి వచ్చారని కోర్టుకు తెలిపారు. ఎన్సీబీ దగ్గర ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని వాదించారు.
శుక్రవారం జరిగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు. ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటుండగా ఆర్యన్ సహా మొత్తం ఎనిమిది మందిని NCB అరెస్టు చేసింది. అప్పటినుంచి ఎన్‌సీబీ ఆఫీస్‌లోనే విచారించింది. ముంబై కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి అతన్ని తరలించినట్టు సమాచారం.
MAA Election: విష్ణు నా క్రమశిక్షణకి వారసుడు.. ఓటేయాలని మోహన్ బాబు లేఖ!